Share News

టీడీపీతోనే రాష్ట్రానికి భవిష్యత్తు

ABN , Publish Date - Dec 31 , 2023 | 12:50 AM

తెలుగుదేశం పార్టీతోనే రాష్ట్ర ప్రజలకు భవిష్యత్తు ఉంటుందని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ పాణ్యం ఇన్‌చార్జి గౌరు చరిత అన్నారు.

టీడీపీతోనే రాష్ట్రానికి భవిష్యత్తు
బుక్‌లెట్‌ను విడుదల చేస్తున్న గౌరు చరిత

మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత

కల్లూరు, డిసెంబరు 30: తెలుగుదేశం పార్టీతోనే రాష్ట్ర ప్రజలకు భవిష్యత్తు ఉంటుందని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ పాణ్యం ఇన్‌చార్జి గౌరు చరిత అన్నారు. శనివారం 35వ వార్డు దాసరిగేరి, అయ్యప్పనగర్‌లో రచ్చబండ, బాబు ష్యూరి టీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం నిర్వహిం చారు. ఆమె కాలనీల్లో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఈసందర్భంగా గౌరు చరిత మాట్లాడుతూ టీడీపీ మహాశక్తి పథకాలతో మహిళలకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. పాదయాత్రలో జగన్‌ ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయారని అన్నారు. 85శాతం జగన్‌ ఇచ్చి న హామీలు ఫెయిల్‌ అయ్యాయని బుక్‌లెట్‌ను ఆమె విడుదల చేశారు. కార్యక్రమంలో వార్డు ఇన్‌చార్జి కోటేష్‌గౌడ్‌, రవిప్రకా ష్‌రెడ్డి, సుంకన్న, ఎన్వీ.రామకృష్ణ, వాకిటి మదేష్‌, రమణమ్మ, ఎస్‌.ఫిరోజ్‌, టీడీపీ బీసీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి కాసాని మహేష్‌గౌడ్‌, బషీర్‌, మౌలాలి, ఖాజాహుశేన్‌, సులేమాన్‌, ధనుంజయ పాల్గొన్నారు.

Updated Date - Dec 31 , 2023 | 12:50 AM