Share News

మాధవరంలో ఉద్రిక్తత

ABN , First Publish Date - 2023-11-19T23:32:41+05:30 IST

కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం మాధవరం గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది.

మాధవరంలో ఉద్రిక్తత

టీడీపీ జెండాను తొలగించిన వైసీపీ నాయకులు

వైసీపీ జెండా ఆవిష్కరణకు ప్రయత్నం

అడ్డుకున్న టీడీపీ నాయకులు

ఇరువర్గాల మధ్య వాగ్వాదం

మంత్రాలయం పోలీస్‌స్టేషన్‌కు టీడీపీ నాయకుల తరలింపు

మంత్రాలయం, నవంబరు 19: కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం మాధవరం గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ నాయకులు టీడీపీ జెండాను తొలగించి తమ పార్టీ జెండాను ఆవిష్కరించేందుకు ఆదివారం సన్నా హాలు చేస్తుండగా ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. మాజీ జడ్పీటీసీ రాజశేఖర్‌ రెడ్డి ఆయన అల్లుళ్లు అమర్నాథ్‌ రెడ్డి, కృష్ణమోహన్‌ రెడ్డిలు కలిసి గతంలో టీడీపీలో ఉండే వారు. అయితే రాజశేఖర్‌ రెడ్డి వైసీపీలో చేరగా ఆయన అల్లుళ్లు మాత్రం టీడీపీలోనే కొనసాగుతున్నారు. రాష్ట్రానికి ఎందుకు కావాలి జగన్‌ అనే కార్యక్రమాన్ని సోమవారం మాధవరంలో నిర్వహించడానికి వైసీపీ ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగానే రాజశేఖర్‌ రెడ్డి గతంలో తన ఆధ్వర్యంలో ఏర్పాటు టీడీపీ జెండాను తొలగించి వైసీపీ జెండా ఏర్పాటుకు ప్రయత్నిస్తుండగా ఆయన అల్లుళ్లు అమర్నాథ్‌ రెడ్డి, కృష్ణ మోహన్‌ రెడ్డి, శివరామిరెడ్డి, రాఘవేంద్రరెడ్డి, సాయి కుమార్‌రెడ్డిలు కార్యకర్తలతో వచ్చి అడ్డుకున్నారు. మామ, అల్లుళ్ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోవడంతో మాధవరం ఎస్‌ఐ కిరణ్‌బాబు పోలీసు సిబ్బందితో వచ్చి టీడీపీ నాయకులను జీపులో ఎక్కించుకొని మంత్రాలయం పోలీస్‌ స్టేషన్‌కు తరలించా రు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి చావిడి వెంకటేశ్‌, ఎల్లారెడ్డి, కృష్ణమోహన్‌ రెడ్డి, శివరామిరెడ్డి, రాఘవేంద్రరెడ్డి జెండా ఏర్పాటు స్థలాన్ని పరిశీలించేందుకు వస్తుండగా.. మంత్రాలయం సీఐ శ్రీనివా సులు, ఎస్‌ఐ కిరణ్‌బాబు, కోసిగి ఎస్‌ఐ సతీష్‌ కుమార్‌ అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, టీడీపీ నాయకుల మద్య వాగ్వాదం జరిగింది. దీంతో వారు రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు వారిని వాహనంలో మంత్రాల యం తరలించారు. విషయం తెలుసుకున్న టీడీపీ నియో జకవర్గ ఇన్‌చార్జి తిక్కారెడ్డి తన కార్యకర్తలతో మంత్రా లయం పోలీస్‌స్టేషన్‌ను ముట్టడించి తమ కార్యకర్త లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. తమ టీడీపీ జెండాను అక్కడే ఉంచాలని డిమాండ్‌ చేశారు. రాజశేఖర్‌ రెడ్డి సొంత స్థలంలో జెండా ఉందని, ఆయనకు ఇష్టమొచ్చినట్లు నడుచుకుంటారని పోలీసులు సమాధానం ఇవ్వడంతో తిక్కారెడ్డి మండిపడ్డారు. తమ పార్టీ జెండాను తొలగించి వైసీపీ జెండాను ఎలా ఎగురవేస్తారని ప్రశ్నిం చారు. పరిస్థితి తీవ్ర ఉద్రిక్తతగా మారుతుండటంతో మంత్రాలయం, మాధవరం, కోసిగి, పెద్దకడుబూరు, నందవరం పోలీసుల బలగాలను మాధవరం, మంత్రాల యం వద్ద మోహరించారు.

Updated Date - 2023-11-19T23:32:44+05:30 IST