పది పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
ABN , First Publish Date - 2023-03-19T00:18:02+05:30 IST
పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ పి.కోటేశ్వర రావు అధికారులను ఆదేశించారు.

కలెక్టర్ పి.కోటేశ్వరరావు
కర్నూలు(ఎడ్యుకేషన్), మార్చి 18: పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ పి.కోటేశ్వర రావు అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లోని సునయన ఆడి టోరియంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల చీఫ్ సూపరింటెండెంట్, డిపార్టు మెంట్ ఆఫీసర్లకు ఆయన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఏప్రిల్ 3వ తేదీ నుంచి 18వ తేదీ వరకు పదో తరగతి పబ్లిక్ పరీక్షలు జరుగుతాయని తెలిపారు. విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాసేలా ఏర్పాట్లు చేసే బాధ్యత చీఫ్ సూపరింటెండెంట్, డిపార్టుమెంట్ ఆఫీస ర్లపై ఉంటుందని తెలిపారు. జవాబు పత్రాలను, స్పాట్ వాల్యుయేషన్ కేంద్రా నికి, ఇతర మెటీరియల్‌ను డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ వారికి పంపించే వరకు చీఫ్ సూపరింటెండెంట్, డిపార్టుమెంట్ ఆఫీసర్లు బాధ్యత వహించాలన్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్స్, ఇతర అధికారులు పరీక్ష కేంద్రంలో ఏదైనా హాలులో మాల్ ప్రాక్టీసు జరుగుతున్నట్లు గుర్తిస్తే హాల్ ఇన్విజిలేటర్ బాధ్యత వహించాలన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉం డేలా చర్యలు తీసుకోవాలన్నారు. డిపార్టుమెంట్ ఆఫీసర్లు పరీక్ష సమయానికి గంట ముందు స్టోరేజ్ పాయింట్‌కు చేరుకుని ప్రశ్నాపత్రాలను ఎస్కార్ట్ సహా యంతో పరీక్ష కేంద్రాలకు తీసుకెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఎగ్జా మినేషన్ అసిస్టెంట్ కమిషనర్ చంద్రభూషణ్, ఏడీ శామ్యూల్‌పాల్, డిప్యూటీ డీఈవోలు హనుమంతరావు, సుకుమార్, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.