బడుగు, బలహీన వర్గాల పార్టీ తెలుగుదేశం

ABN , First Publish Date - 2023-08-31T00:35:25+05:30 IST

తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ అని కర్నూలు జిల్లా అధ్యక్షుడు బీటీ నాయుడు పేర్కొన్నారు.

బడుగు, బలహీన వర్గాల పార్టీ తెలుగుదేశం
మాట్లాడుతున్న బీటీ నాయుడు

కర్నూలు జిల్లా అధ్యక్షుడు బీటీ నాయుడు

కర్నూలు(అగ్రికల్చర్‌), ఆగస్టు 30: తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ అని కర్నూలు జిల్లా అధ్యక్షుడు బీటీ నాయుడు పేర్కొన్నారు. బుధవారం నగరంలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో బీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు సత్రం రామకృష్ణుడు అధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా బీటీ నాయుడు మాట్లాడుతూ బీసీలకు రాజకీయంగా ఇతరత్రా అన్ని రంగాల్లో అవకాశాలను కల్పించిన ఏకైన పార్టీ తెలుగుదేశమే అన్నారు. బీసీలను కిందిస్థాయి నుంచి చట్టసభలకు పంపిన ఘనత ఎన్టీఆర్‌కే దక్కిందన్నారు. సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి బీసీ లను కేవలం ఓటుబ్యాంకుగా మాత్రమే చూశాడన్నారు. జగన్‌ ప్రభుత్వంలో బీసీలు పడ్డ కష్టాలు గతంలో ఏ ప్రభుత్వంలోనూ పడలేదన్నారు. బీసీల జనాబా ప్రాతిపదికన చట్టసభల్లో సీట్లు దక్కాలంటే ఖచ్చితంగా కులగణన చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ఈసమావేశంలో తిరుపాలుబాబు, మధుసూధన్‌ నాయుడు, మహేష్‌గౌడు, రాజుయాదవ్‌, సంజీవలక్ష్మి, ముంతాజ్‌, సుకన్య, చంద్రకాంత్‌, రాజ్యలక్ష్మి, గణేష్‌, ఎల్లప్ప, సుభాష్‌చంద్రబోసు, నరసింహనాయుడు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-08-31T00:35:25+05:30 IST