రోడ్డు ప్రమాదంలో టీడీపీ కార్యకర్త మృతి

ABN , First Publish Date - 2023-09-26T00:01:17+05:30 IST

మండలం లోని ఇల్లూరుకొత్తపేట గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త యన్నం మదన్‌ మోహన్‌రెడ్డి (50) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.

రోడ్డు ప్రమాదంలో టీడీపీ కార్యకర్త మృతి

బనగానపల్లె, సెప్టెంబరు 25: మండలం లోని ఇల్లూరుకొత్తపేట గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త యన్నం మదన్‌ మోహన్‌రెడ్డి (50) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. బనగానపల్లె ఎస్‌ఐ రామిరెడ్డి తెలిపిన వివరా లివీ.. సోమవారం రాత్రి మోటారు సైకిల్‌పై బనగానపల్లె నుంచి ఇల్లూరు కొత్తపేటకు వెళ్తుండగా ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనడంతో ఆయన మృతి చెందారు. బనగానపల్లె లైబ్రరీలో పని ముగించుకొని తన స్వగ్రామం ఇల్లూరు కొత్తపేటకుమోలారు సైకిల్‌పై వెళ్తుండగా ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనడంతో మదన్‌మోహన్‌రెడ్డికి తీవ్రంగా గాయపడ్డారు. ఆయనను 108 వాహనం ద్వారా బనగానపల్లె ప్రభుత్వవైద్యశాలకు తరలించగా అక్కడ వైద్యులు ప్రాథమిక చికిత్సలు చేసి కర్నూలు ప్రభుత్వాసుపత్రికి రెఫర్‌ చేశారు. కర్నూలుకు మదన్‌మోహన్‌రెడ్డిని తరలిస్తుండగా ఆస్పత్రి వద్దనే మృతి చెందారు. మదన్‌మోహన్‌రెడ్డికి భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. బనగానపల్లె మాజీ సర్పంచ్‌ బీసీ రాజారెడ్డి, మిట్టపల్లె సర్పంచ్‌ తులసిరెడ్డి తదితరులు బనగానపల్లె వైద్యశాలకు వచ్చి మదన్‌మోహన్‌రెడ్డి భౌతిక కాయానికి నివాళి అర్పించారు.

Updated Date - 2023-09-26T00:01:17+05:30 IST