న్యాయం గెలవాలి
ABN , First Publish Date - 2023-10-30T00:41:06+05:30 IST
నిజం గెలవాలి.. న్యాయం గెలవాలి అంటూ టీడీపీ నాయకులు ఆదివారం కళ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలిపారు.
నిజం గెలవాలి.. న్యాయం గెలవాలి అంటూ టీడీపీ నాయకులు ఆదివారం కళ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలిపారు. చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేశారని, ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందని అన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని, ప్రజలు కూడా భయాందోళనకు గురవుతున్నారని అన్నారు.
బనగానపల్లె, అక్టోబరు 29: బనగానపల్లె పట్టణంలో మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి ఆధ్వర్యంలో కళ్లకు గంతలు కట్టుకొని జగనాసుర చీకటి పాలనను తరిమికొడదాం అంటూ ఆదివారం రాత్రి టీడీపీ నాయకుల నిరసన చేపట్టారు. సైకో పోవాలి, సైకిల్ రావాలి, నిజం గెలవాలి అంటూ నినాదాలు చేశారు. బీసీ మాట్లాడుతూ వైసీపీ పాలనకు చరమగీతం పాడాల్సిన సమయం అసన్నమైందని అన్నారు. అన్వర్‌సాహెబ్, బొబ్బల గోపాల్‌రెడ్డి, సర్పంచ్ తులసిరెడ్డి, మౌళీశ్వరరెడ్డి, కాశీంబాబు, గౌండాబాబు, నియోజకరవర్గం మైనార్టీ సెల్ అధ్యక్షుడు సలాం, పూల కలాం, అహ్మద్ హుస్సేన్, లాయర్ నాగేంద్రారెడ్డి, ఖాదర్; హర్షద్, పవన్‌కుమార్‌రెడ్డి, ఇస్మాయిల్ ఖాన్, షబ్బీర్, అధిక సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కోవెలకుంట్ల: సైకో జగన్ పోయి సైకిల్ రావాలని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గడ్డం రామకృష్ణారెడ్డి అన్నారు. చంద్రబాబు అరెస్టుకు నిసరగా ఆదివారం ఆయన సతీమణి భువనేశ్వరి చేపట్టిన నిజం గెలవాలి న్యాయం గెలవాలి అనే కార్యక్రమానికి సంఘీభావంగా కోవెలకుంట్లలో కళ్లకు గంతలు కట్టుకుని నిరసన కార్యక్రమం చేపట్టారు. గడ్డం నారాయణమ్మ, లక్షమ్మ, దూదేకుల దస్తగిరమ్మ, మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ గడ్డం నాగేశ్వర్ రెడ్డి, శంకర్ రెడ్డి, తులసిరెడ్డి, రామకృష్ణారెడ్డి, గడ్డం అమరనాథరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డలో టీడీపీ విస్తృత స్థాయి సమావేశం అనంతరం టీడీపీ నాయకులు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. న్యాయమే గెలవాలని కోరుకున్నారు. భూమా అఖిలప్రియ, జగత్‌విఖ్యాత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
డోన్: టీడీపీ అధినేత చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి జైలులో నిర్బంధించిన సీఎం జగన్ కళ్లు తెరిపించేలా తిరుగుబాటు చేద్దామని డోన్ టీడీపీ మండల అధ్యక్షుడు శ్రీనివాసులు యాదవ్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు ప్రజావైద్యశాల మల్లికార్జున అన్నారు. ఆదివారం రాత్రి పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద చంద్రబాబు అక్రమ అరెస్టు పై కళ్లు తెరిపిద్దామని టీడీపీ నాయకులు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ప్యాపిలి మండల అధ్యక్షులు గండికోట రామసుబ్బయ్య, ఎస్‌ఎండీ రపీ, గురుస్వామి యాదవ్, గోవిందరెడ్డి, నీలం ప్రభాకర్, ప్రవీణ్‌రెడ్డి, వెంకట్రాముడు, బాలు, ఆలిబాబా, వీరాంజనేయులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో చీకటి పాలన సాగిస్తున్న వైసీపీ ప్రభుత్వాన్ని అంతమొందిద్దామని టీడీపీ డోన్ ఇన్‌చార్జి ధర్మవరం సుబ్బారెడ్డి పిలుపు నిచ్చారు. ఆదివారం రాత్రి కళ్లకు గంతలు కట్టుకుని సుబ్బారెడ్డి నిరసన వ్యక్తం చేశారు. జగనాసుర కళ్లు తెరిపిద్దామంటూ నినాదాలు చేశారు.
ప్యాపిలి: టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ నిర్భందాన్ని వ్యతిరేకిస్తూ ఆదివారం రాత్రి ప్యాపిలిలో ఆ పార్టీ నాయకులు కళ్లు తెరిపిద్దాం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలు కళ్లకు గంతలు కట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. పార్టీ శ్రేణులు వైసీపీకి, సీయం జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నాయకులు రామ్మోహన్‌యాదవ్, కోదండరామయ్య, నరేంద్ర, మద్దిలేటి, తిమ్మగురుడు పాల్గొన్నారు.
బేతంచెర్ల: టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా నిజం గెలవాలి.. కళ్లు తెరిపిద్దాం.. కార్యక్రమాన్ని టీడీపీ నంద్యాల లోక్‌సభ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు పోలూరు వెంకటేశ్వరరెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి షేక్షావలి చౌదరి, జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. బేతంచెర్ల పాతబస్టాండు నందు టీడీపీ నాయకులు నిజం గెలవాలి.. కళ్లు తెరిపిద్దాం అంటూ నినాదాలు చేశారు. నాయకులు ఉన్నం చంద్రశేఖర్, ఉన్నం సుధాకర్, బుగ్గానిపల్లి రమేష్, మేకల నాగరాజు, శ్రీనివాసు యాదవ్, రేగటి భీమారెడ్డి, ఎంఎస్ పీవీ రమణ, జనసేన నాయకుడు కంటి మధు సుకుమార్, ఆవుల రాజశేఖర్, పూలమధు, టీడీపీ నాయకులు నారాయణస్వామి, రామ్మూర్తి, నంద్యాల మధు, ముల్లా లోకేశ్ గౌడు, మధు లోకేశ్వరగౌడు, వంశీకృష్ణ, ఆవుల రామకృష్ణ, నాగరాజు, కానాల అంజి, జగదీష్, తిమ్మరాజు, పూల మద్దిలేటి, తిరుమలేష్ ఉపేంద్ర పాల్గొన్నారు. అలాగే బేతంచెర్లలో కోటపేటలో నిజం గెలవాలి కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని నినాదాలు చేశారు. రుద్రవరం గ్రామంలో నిజం గెలవాలి కార్యక్రమాన్ని నిర్వహించారు. సురేష్, వీరాంజనేయులు, హేమంత్, శ్రీనివాసులు, సంజు, రాజు, వీరేష్, గణేష్,ప్రసాద్, రామకృష్ణ, రవి, విజయ్, షేక్షావలి, మహేంద్ర, కిరణ్, బద్రీనాథ్, పులేంద్ర, ఆనంద్, మధు, విల్సన్ పాల్గొన్నారు.