రూ.26 లక్షల పన్ను వసూలు
ABN , First Publish Date - 2023-03-20T00:02:50+05:30 IST
నగర పాలక సంస్థ పరిధిలోని ఆస్తి,కొళాయి పన్ను ద్వారా ఒక్కరోజు రూ.26 లక్షల ఆదాయం వచ్చింది. ఆస్తిపన్నుపై రాష్ట్ర ప్రభుత్వం వనటైం సెటిల్‌మెంట్ కింద వడ్డీ మాఫీ చేస్తూ రెండు రోజుల కిందట ఉత్తర్వుల జారీ చేసింది.

కర్నూలు(న్యూసిటీ), మార్చి 19: నగర పాలక సంస్థ పరిధిలోని ఆస్తి,కొళాయి పన్ను ద్వారా ఒక్కరోజు రూ.26 లక్షల ఆదాయం వచ్చింది. ఆస్తిపన్నుపై రాష్ట్ర ప్రభుత్వం వనటైం సెటిల్‌మెంట్ కింద వడ్డీ మాఫీ చేస్తూ రెండు రోజుల కిందట ఉత్తర్వుల జారీ చేసింది. ఈ మేరకు కార్పొరేషన కార్యాలయంలో ఆదివారం కూడా పన్ను వసూళ్లకు కౌంటర్ తెరచి ఉంచారు. ఈ అవకాశం ఈ నెలాఖరు వరకు ఉండటంతో ప్రజలు పెద్ద ఎత్తున ఆస్తి పన్ను చెల్లిస్తున్నారు. ఆదివారం ఒక్కరోజు ఆస్తి పన్ను నగదు రూపంలో రూ.12 లక్షలు, చెక్కుల రూపంలో రూ.12 లక్షలు రాగా కొళాయి పన్ను రూ. 4 లక్షలు చెల్లించారు. మేనేజర్ చిన్నరాముడు పర్యవేక్షణలో సిబ్బంది మల్లికార్జున, రమే్‌షబాబు, రాజేష్, కంప్యూటర్ ఆపరేటర్ షాషా కౌంటర్‌లో విధులు నిర్వహించారు.