గోదాముల పనులు నిలిపివేత

ABN , First Publish Date - 2023-03-18T00:15:24+05:30 IST

రైతులు పంట ఉత్పత్తులను నిల్వ చేసుకునేందుకు రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాములను నిర్మిస్తోంది

గోదాముల పనులు నిలిపివేత
ఎస్‌డబ్ల్యూసీ గోదాము నిర్మాణం కోసం తవ్విన గుంతలు

కర్నూలు(అగ్రికల్చర్‌), మార్చి 17: రైతులు పంట ఉత్పత్తులను నిల్వ చేసుకునేందుకు రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాములను నిర్మిస్తోంది. కర్నూలు నగరంలోని కోడుమూరు రోడ్డు సమీపంలో రేడియోస్టేషన్‌ పక్కన ఎస్‌డబ్ల్యూసీ సంస్థకు చెందిన ఖాళీ స్థలంలో గోదాములు నిర్మిం చేందు కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. దాదాపు మూడు వేల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం ఉన్న పంట ఉత్పత్తులను రైతులు ఇక్కడ నిల్వ చేసుకునే అవకాశం ఉంటుందని ఎస్‌డబ్ల్యూసీ అధికార వర్గాలు తెలిపాయి. అయితే.. ఆదిలోనే హంసపాదు అన్నట్లుగా ఈ గోదాముల నిర్మాణానికి సంబంధించిన స్థలం విషయంలో ఎస్‌డబ్ల్యూసీ సంస్థతోపాటు మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారుల మధ్య వివాదం నెలకొంది. టౌన్‌ ప్లానిం గ్‌ ప్రకారం ఎస్‌డబ్ల్యూసీ నిర్మిస్తున్న గోదాము స్థలం తమదేనని మున్సి పల్‌ కార్పొరేషన్‌ అధికారులు వాదిస్తున్నారు. అయితే.. ఈ స్థలం ప్రభు త్వం తమకు కేటాయించిందని, అన్ని ఆధారాలను ఎస్‌డబ్ల్యూసీ అధికా రులు మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఉన్నతాధికారులకు సమర్పించారు. అయినా కూడా కొంత మంది రాజకీయ నాయకుల జోక్యంతో ఈ స్థలంలో నిర్మి స్తున్న గోదాముల నిర్మాణానికి బ్రేక్‌ పడింది. దీంతో రైతులు తీవ్ర ఆందో ళన చెందుతున్నారు. ప్రభుత్వం వెంటనే ఈ స్థలంలో ఎస్‌డబ్ల్యూసీ గోదా ముల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని జిల్లా రైతులు కోరుతున్నారు.

ఈ స్థలం మాదే

రైతుల పంట ఉత్పత్తులను నిల్వ చేసేందుకు అవకాశం కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం స్థలాన్ని మాకు స్వాధీనం చేసింది. గోదాముల నిర్మాణానికి నిధులు కూడా మంజూరయ్యాయి. టెండర్లు పిలిచి కాం ట్రాక్టర్లు పని చేపట్టి పునాదులు కూడా తవ్వారు. ఈ సమయంలో మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు ఇక్కడ గోదాములు నిర్మించడానికి వీలు లేదని చెబుతూ పనులు నిలిపివేశారు. ప్రభుత్వానికి అన్ని ఆధారా లతో మేము నివేదికను పంపాం. తొందరలోనే మాకు అనుకూలంగా అనుమతి వస్తుందని ఆశిస్తున్నాం.

- ఎస్‌డబ్ల్యూసీ మేనేజర్‌, నందిని

Updated Date - 2023-03-18T00:15:24+05:30 IST