మురుగు శుద్ధి కేంద్రం ఏర్పాటుకు చర్యలు: జేసీ
ABN , First Publish Date - 2023-10-30T00:38:15+05:30 IST
పట్టణ సమీపంలోని హైవేలో మురుగు నీటి శుద్ధి కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు.
డోన్, అక్టోబరు 29: పట్టణ సమీపంలోని హైవేలో మురుగు నీటి శుద్ధి కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు. పట్టణంలోని హైవేలో ఆదివారం భూములను పరిశీలించారు. జేసీ మాట్లాడుతూ నాలుగెకరాల విస్తీర్ణంలో శుద్ధి కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. రైతుకు సంబంధించిన భూ రికార్డులను పరిశీలించారు. రైతులు కూడా సమ్మతి తెలిపినట్లు జేసీ చెప్పారు. ఆయన వెంట ఆర్డీవో వెంకటరెడ్డి, తహసీల్దార్ విద్యాసాగర్, ప్యాపిలి తహసీల్దార్ చంద్రశేఖర్ వర్మ ఉన్నారు.