అయోధ్య శ్రీరామ అక్షింతలకు పూజలు
ABN , First Publish Date - 2023-12-10T23:37:04+05:30 IST
చాగలమర్రి గ్రామంలోని పట్టాభిరామ ఆలయం, శివరామానంద ఆశ్రమంలో ఆదివారం అయోద్య శ్రీరామ ఆలయం నుంచి తెచ్చిన అక్షింతలకు వేద పండితుడు పెద్దశాస్త్రి ఆధ్వర్యంలో ముందుగా మహిళలు ప్రత్యేక పూజలు చేశారు.
చాగలమర్రి, డిసెంబరు 10: చాగలమర్రి గ్రామంలోని పట్టాభిరామ ఆలయం, శివరామానంద ఆశ్రమంలో ఆదివారం అయోద్య శ్రీరామ ఆలయం నుంచి తెచ్చిన అక్షింతలకు వేద పండితుడు పెద్దశాస్త్రి ఆధ్వర్యంలో ముందుగా మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. అయోద్య శ్రీరామ ఆలయం నుంచి తెచ్చిన అక్షింతలకు మరిన్ని బియ్యం కలిపి అక్షింతలుగా తయారు చేశారు. ఆయా గ్రామాల్లో అయోధ్య శ్రీరామ అక్షింతలు పంపిణీ చేస్తామని సమరసతా సేవా ఫౌండేషన్ జిల్లా సహకన్వీనర్ సల్లా నాగరాజు తెలిపారు. అక్షింతలను పవిత్రంగా ఉంచి భక్తులకు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ఎస్‌ఎస్‌ఎఫ్ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు.
ప్యాపిలి: అయోధ్య శ్రీరాముడి అభిషేకం అక్షింతలను ప్రతి గ్రామానికి అందించాలని విశ్వహిందూ పరిషత్ జిల్లా సహాయ కార్యదర్శి రామకృష్ణ సూచించారు. ఆదివారం పట్టణంలోని రామలింగేశ్వరస్వామి ఆలయంలో విశ్వహిందూ పరిషత్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఈ ఆయన మాట్లాడుతూ ఆయోధ్య రామాలయం దేశానికే తలమానికం అన్నారు. రామ మందిరం విశిష్టతను ప్రతి గ్రామంలో కూడా ప్రజలకు తెలియజేయాలన్నారు. విశ్వహిందూ పరిషత్ నాయకులు రామ రాజేష్, గోపాల్‌రెడ్డి, నరేష్ కుమార్, అశోక్, రవిసింగ్ తదితరులు పాల్గొన్నారు.