వైసీపీ జెండా ఏర్పాటు దుర్మార్గం
ABN , First Publish Date - 2023-11-20T00:37:52+05:30 IST
మాధవరం సర్కిల్‌లో ఉన్న తెలుగుదేశం పార్టీ జెండాను తీసేసి వైసీపీ జెండాను ఏర్పాటు చేయడం దుర్మార్గమని టీడీపీ మంత్రాలయం ఇన్‌చార్జి పాలకుర్తి తిక్కారెడ్డి అన్నా రు.

టీడీపీ మంత్రాలయం ఇన్‌చార్జి తిక్కారెడ్డి
మంత్రాలయం, నవంబరు 19: మాధవరం సర్కిల్‌లో ఉన్న తెలుగుదేశం పార్టీ జెండాను తీసేసి వైసీపీ జెండాను ఏర్పాటు చేయడం దుర్మార్గమని టీడీపీ మంత్రాలయం ఇన్‌చార్జి పాలకుర్తి తిక్కారెడ్డి అన్నా రు. ఆదివారం రాత్రి ఈ విషయంపై టీడీపీ జెండాను అడ్డుకున్న అరెస్టు చేసిన కార్యకర్తలను విడిపించుకుని మంత్రాలయం పోలీస్‌స్టేషన్ నుంచి పన్నగ వెంకటేశ్ హోటల్ వరకు నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. సమావేశంలో తెలుగు రైతు రాష్ట్ర కార్యదర్శులు నరవ రమాకాంత్ రెడ్డి, బూదూరు మల్లికార్జున రెడ్డి, పన్నగ వెంకటేశ్, మాధవ రం అమర్నాథ్ రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, రాఘవేంద్రరెడ్డి, వెంకటపతిరాజు, చిన్నబసప్ప, జ్ఞానేష్, యేబు, నక్కి వెంకటేశ్, అండే హనుమంతు పాల్గొన్నారు.