నేడు ‘రాయలసీమ అభివృద్ధి - మీడియా పాత్ర’పై సెమినార్‌

ABN , First Publish Date - 2023-03-25T23:10:16+05:30 IST

ఏపీ యూనియన ఆఫ్‌ వర్కింగ్‌ జర్నలిస్టు (ఏపీయూడబ్ల్యూజే) ఆధ్వర్యంలో ‘రాయలసీమ అభివృద్ధి - మీడియా పాత్ర’ అనే అంశంపై ఆదివారం సెమినార్‌ నిర్వహిస్తున్నామని ఐజేయూ జాతీయ సమితి సభ్యులు గోరంట్ల కొండప్ప, కే నాగరాజు, ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఈఎన నాగరాజు, కే శ్రీనివాస్‌ గౌడ్‌లు పిలుపునిచ్చారు.

నేడు ‘రాయలసీమ అభివృద్ధి - మీడియా పాత్ర’పై సెమినార్‌

కర్నూలు(కల్చరల్‌), మార్చి 25: ఏపీ యూనియన ఆఫ్‌ వర్కింగ్‌ జర్నలిస్టు (ఏపీయూడబ్ల్యూజే) ఆధ్వర్యంలో ‘రాయలసీమ అభివృద్ధి - మీడియా పాత్ర’ అనే అంశంపై ఆదివారం సెమినార్‌ నిర్వహిస్తున్నామని ఐజేయూ జాతీయ సమితి సభ్యులు గోరంట్ల కొండప్ప, కే నాగరాజు, ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఈఎన నాగరాజు, కే శ్రీనివాస్‌ గౌడ్‌లు పిలుపునిచ్చారు. నగరంలోని నంద్యాల చెక్‌పోస్టు సమీపంలో ఉన్న దేవి ఫంక్షన హాలులో జరిగే ఈ సెమినార్‌ సందర్భంగా వారు మాట్లాడారు. సీమ అభివృద్ధికి అవకాశాలు ఉన్న అంశాలపై చర్చించి, కథనాల రూపంలో పాలకుల దృష్టికి తీసుకెళ్లడానికి ఈ సెమినార్‌ ఎంతో ఉపయోగపడుతుందని వారు చెప్పారు. ఈ సెమినార్‌కు ముఖ్య అతిథులుగా ఇండియన జర్నలిస్ట్‌ యూనియన (ఐజేయూ) జాతీయ అధ్యక్షుడు కె.శ్రీనివాసరెడ్డి, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ సుబ్బారావుతోపాలు పలువురు రాజకీయ నాయకులు తదితరులు పాల్గొంటారని, జర్నలిస్టులంతా హాజరై సెమినార్‌ను విజయవంతం చేయాలని వారు కోరారు.

Updated Date - 2023-03-25T23:10:16+05:30 IST