ఆ సర్పంచ్‌కు వందనం
ABN , First Publish Date - 2023-06-07T23:20:13+05:30 IST
అధికార పార్టీ ప్రజా సమస్యలను గాలికి వదిలేసినా ఓటువేసి గెలిపించిన ప్రజల కోసం సర్పంచ్ రామాంజినేయులు పారిశుధ్య కార్మికుడిగా మారి మురికి కాలువలను శుభ్రం చేయడం హర్షించదగ్గ విషయమని, ఇప్పటికైనా ప్రభుత్వానికి బుద్ధి రావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు.
తుగ్గలి, జూన్ 7: అధికార పార్టీ ప్రజా సమస్యలను గాలికి వదిలేసినా ఓటువేసి గెలిపించిన ప్రజల కోసం సర్పంచ్ రామాంజినేయులు పారిశుధ్య కార్మికుడిగా మారి మురికి కాలువలను శుభ్రం చేయడం హర్షించదగ్గ విషయమని, ఇప్పటికైనా ప్రభుత్వానికి బుద్ధి రావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. బుధవారం తుగ్గలిలో సర్పంచ్ రామాంజినేయులు, ఆయన సతీమణి లక్ష్మీదేవిలను పూలమాలలు, శాలువాలతో ఆయన సన్మానించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ సర్పంచ్ పదవితో గర్వపడకుండా ప్రజలు ఇబ్బందులు పరిష్కరించడానికి తానే మురికి కాలువలను శుభ్రం చేశారని అన్నారు. ఆర్థికసంఘం నిధులను దారి మళ్లించడంతో పంచాయతీలు నిర్వీర్యం అయ్యాయని, దీంతో సర్పంచ్‌లు ప్రజలకు ఏమి చేయలేని స్థితి ఏర్పడిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ రాష్ట్ర శాలివాహన కార్పొరేషన్ చైర్మన్ తుగ్గలి నాగేంద్ర, సీపీఐ రైతుసంఘం రాష్ట్ర కార్యదర్శి రామచంద్రయ్య, సీపీఐ నాయకులు గిడ్డయ్య, నబిరసూల్, రాజాసాహెబ్, సుల్తాన్, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.