విధి నిర్వహణలో ఆర్టీసీ డ్రైవర్ మృతి
ABN , First Publish Date - 2023-11-10T00:08:14+05:30 IST
ఆళ్లగడ్డ ఆర్టీసీ డిపోలో డ్రైవరుగా పని చేస్తున్న రవికుమార్(53) విధి నిర్వహణలో గురువారం మృతి చెందారు.
ఆళ్లగడ్డ, నవంబరు 9: ఆళ్లగడ్డ ఆర్టీసీ డిపోలో డ్రైవరుగా పని చేస్తున్న రవికుమార్(53) విధి నిర్వహణలో గురువారం మృతి చెందారు. రవికుమార్ బెంగళూరు సర్వీసుకు వెళ్లారు. తిరిగి ఆళ్లగడ్డకు చేరుకున్నారు. అక్కడి నుంచి నంద్యాలకు వెళ్లాల్సి ఉండగా అస్వస్థతకు గురి కావడంతో ఆటోలో కండక్టరుతో కలిసి పట్టణం లోని ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స చేయించుకోవ డానికి వచ్చారు. చికిత్స చేయించుకునేలోపే చనిపోయారు. రవికుమార్ చాగలమర్రి గ్రామంలో నివాసం ఉంటున్నారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమారులు ఆర్టీసీ డీఎం రాజశేఖరరెడ్డి ప్రభుత్వ వైద్యశాలకు వచ్చి విచారణ చేసుకున్నారు. ఆయన డ్రైవరు మృతి పట్ల ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు. ఆర్టీసీ సంఘాల నాయకులు వచ్చి సానుభూతి ప్రకటించారు. పని వత్తిడితోనే డ్రైవరు రవికుమార్ మృతి చెందాడని కార్మికులు ఆరోపించారు. ఆర్టీసీ అధికారులు సకాలంలో సెలవులు ఇవ్వకుండా పని చేయించుకుంటున్నారని ఆరోపించారు. కనీసం వైద్యం చేయించుకోవడానికైనా సెలవులు ఇవ్వకుండా అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు.