Share News

చికిత్స పొందుతూ రైతు మృతి

ABN , First Publish Date - 2023-10-30T00:39:07+05:30 IST

మండలంలోని హుశేనాపురం గ్రామానికి చెందిన బోయిని లక్ష్మన్న (38) ఆత్మహత్య చేసుకున్నారు.

చికిత్స పొందుతూ రైతు మృతి

బేతంచెర్ల, అక్టోబరు 29: మండలంలోని హుశేనాపురం గ్రామానికి చెందిన బోయిని లక్ష్మన్న (38) ఆత్మహత్య చేసుకున్నారు. హెడ్‌ కానిస్టేబుల్‌ సజ్జాద్‌ వలి ఆదివారం తెలిపిన వివరాలివీ.. లక్ష్మన్న తన ఇంట్లో ఎవరూ లేని సమయంలో శనివారం ఉదయం 8 గంటలకు అప్పుల బాధ తాళలేక పురుగుల మందు తాగారు. లక్ష్మన్న ఏడు ఎకరాల సొంత పొలంతో పాటు మరో 9 ఎకరాలు కౌలుకు తీసుకుని 16 ఎకరాలు పంటలు సాగు చేసేవారు. రూ.10 లక్షలు అప్పులు చేశారు. పంటలు చేతికి రాకపోవడంతో అప్పులు ఎలా తీర్చాలో మదనపడుతూ పురుగుల మందు తాగారు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు. లక్ష్మన్న భార్య రాములమ్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్‌ కానిస్టేబుల్‌ తెలిపారు.

Updated Date - 2023-10-30T00:39:07+05:30 IST