Share News

ఆవుకు, ఎద్దుకు తేడా తెలియని పాలకులు

ABN , First Publish Date - 2023-12-10T00:13:56+05:30 IST

ఆవుకు, ఎద్దుకు తేడా తెలియని వాళ్లు రాజ్యానేలుతున్నారని.. వడ్లు, గోదుమ పైర్లు తెలియని వారు వ్యవ సాయ అధికారులుగా కొనసాగుతున్నారని అలాం టప్పుడు వ్యవసాయం ఎలా అభివృద్ధి చెందుతుందని విశ్రాంతి వ్యవసాయ శాఖ కమిషనర్‌ దాసరి శ్రీనివాసులు అన్నారు.

ఆవుకు, ఎద్దుకు తేడా తెలియని పాలకులు

కులమతాలకు అతీతంగా రైతు కార్తీక వనభోజనం ఏర్పాటు శుభపరిణామం

విశ్రాంత వ్యవసాయ శాఖ కమిషనర్‌ దాసరి శ్రీనివాసులు

పత్తికొండ టౌన్‌, డిసెంబరు 9: ఆవుకు, ఎద్దుకు తేడా తెలియని వాళ్లు రాజ్యానేలుతున్నారని.. వడ్లు, గోదుమ పైర్లు తెలియని వారు వ్యవ సాయ అధికారులుగా కొనసాగుతున్నారని అలాం టప్పుడు వ్యవసాయం ఎలా అభివృద్ధి చెందుతుందని విశ్రాంతి వ్యవసాయ శాఖ కమిషనర్‌ దాసరి శ్రీనివాసులు అన్నారు. శనివారం స్థానిక రాజులమండగిరి సమీ పాన రామలింగేశ్వ రస్వామి దేవాలయ ప్రాంగణంలో రైతు కార్తీక వనభో జన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా ఆలిం డియా కిసాన్‌ సభ జాతీయ అధ్యక్షుడు రాగుల వెంకయ్య, రిటైర్డు వ్యవసా యశాఖ కమిషనర్‌ దాసరి శ్రీనివాసులు, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు రామచంద్రయ్య హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా దాసరి శ్రీనివా సులు మాట్లాడుతూ వ్యవసాయానికి మూలాధారం మహిళలేనని అన్నారు. ప్రస్తుతం సమాజంలో వ్యవసాయ శాఖలో ఉన్నత పదవుల్లో ఉన్నవారు వ్యవసాయం అంటే ఏంటో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారన్నారు. అందుకే తాను కమిషనర్‌గా ఉన్న సమయంలో వ్యవ సాయాన్ని రద్దు చేయాలని ప్రభుత్వానికి సిఫారసు చేశానని గుర్తు చేశారు. వ్యవసాయ శాఖలో ఉద్యోగం పొందే వారు ఉన్నత పదవులు, ఉన్నత ఉద్యోగాలు తదితర అర్హత కలిగిన వారందరికీ పోస్టింగ్‌ ఉంటే ఐదేళ్ల పాటు వరి, గోదుమ పంటల వ్యవసాయం చేయాలని నిబంధన పెడితే.. అప్పుడే దేశంలో వ్యవసాయం అభివృద్ధి చెందుతుందన్నారు. ఏఐకేసీ జాతీయ అధ్యక్షుడు రాగుల వెంకయ్య మాట్లాడుతూ కుల భోజ నాలకు వ్యతరేకంగా రైతు సంఘం వనభోజన కార్యక్రమాన్ని నిర్వహిం చడం ఎంతో శుభపరిణామమన్నారు. కార్యక్రమంలో జడ్పీ మాజీ చైర్మన్‌ బత్తిన వెంకట్రాముడు, మాజీ జడ్పీటీసీ మెంబరు హోటల్‌ శ్రీనివాసులు, సీపీఐ జిల్లా కార్యదర్శి గిడ్డయ్య, పత్తికొండ మాజీ సర్పంచ్‌ సోమశేఖర్‌, సర్పంచులు రవిమోహన్‌, కేశవరెడ్డి, భాస్కర్‌ రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2023-12-10T00:13:57+05:30 IST