గవర్నర్‌ పర్యటన ఏర్పాట్ల పరిశీలన

ABN , First Publish Date - 2023-01-15T00:25:06+05:30 IST

రాష్ట్ర గవర్నర్‌ బిఽశ్వభూషన్‌ హరిచందన్‌ ఈనెల 20 న పాణ్యం పర్యటనకు వస్తున్న సందర్భంగా కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సామూన్‌ ఏర్పాట్లను పరిశీలించారు.

గవర్నర్‌ పర్యటన ఏర్పాట్ల పరిశీలన

పాణ్యం, జనవరి 14 : రాష్ట్ర గవర్నర్‌ బిఽశ్వభూషన్‌ హరిచందన్‌ ఈనెల 20 న పాణ్యం పర్యటనకు వస్తున్న సందర్భంగా కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సామూన్‌ ఏర్పాట్లను పరిశీలించారు. శ నివారం కలెక్టరుతో పాటు ఎస్పీ రఘువీర్‌రెడ్డి, డీఎస్పీ మహేశ్వరరెడ్డి, ఆర్డీఓ శ్రీనివాసులు నెరవాడ మెట్ట సమీపంలోని ఏపీ గిరిజన గురుకుల బాలికల పాఠశాలను పరిశీలించారు. గవర్నర్‌తో పాణ్యం చెంచుల ముఖాముఖి చర్చలకు స్థలం ఏర్పాటును పరిశీలించారు. సభా ప్రాంగణం, సభికుల సౌకర్యాలపై ఆర్డీఓ, ఎస్పీతో చర్చించారు. నెరవాడ మెట్ట నుంచి పాఠశాల వరకు బీటీ రోడ్డు నిర్మాణం వెంటనే చేపట్టాలన్నారు. హైవే నుంచి పాఠశాల వరకు పారిశుద్య ఏర్పాట్లు చేపట్టాలని ఎంపీడీవో దస్తగిరిని ఆదేశించారు. సభలో హాజరయ్యే వారి వివరాలు వెంటనే తెలియజేయాలన్నారు. ముఖాముఖి చర్చల్లో పాల్గొనే చెంచులకు ప్రత్యేక ఏర్పాటు చేయాలన్నారు. సభాప్రాంగణం వద్ద విద్యార్థులు, చెంచులకు ప్రత్యేక సీట్లు ఏర్పాటు చేయాలన్నారు. సభాస్థలం చదును, క్లీనింగ్‌ చర్యలు వెంటనే చేపట్టాలన్నారు. సభా కార్యక్రమం వీక్షించడానికి అనువైన స్ర్కీన్‌లను ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దారు మల్లికా ర్జునరెడ్డి, ఎంపీడీఓ దస్తగిరి, ఈఓఆర్‌డీ భాస్కరరావు, సీఐ వెంకటేశ్వరరావు, ఎస్‌ఐ సుధాకర్‌రెడ్ది, ప్రిన్సిపాల్‌ మేరీసలోమి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-15T00:25:10+05:30 IST