Share News

రమణీయం.. రామదాసు రథోత్సవం

ABN , First Publish Date - 2023-12-10T23:32:46+05:30 IST

మండలంలోని రామదాసు స్వామి రథోత్సవం ఆదివారం సాయంత్రం కన్నుల పండువగా జరిగింది.

రమణీయం.. రామదాసు రథోత్సవం

కోడుమూరు(రూరల్‌), డిసెంబరు 10: మండలంలోని రామదాసు స్వామి రథోత్సవం ఆదివారం సాయంత్రం కన్నుల పండువగా జరిగింది. వార్షిక తిరుణాల వేడుకల్లో భాగంగా రథోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో అభిషేకం, పుష్పార్చన, ఆకుపూజ వంటి విశేష పూజలు జరిపించారు. సాయంత్రం స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని రథంపై కొలువుంచి భక్తులు ఉత్సాహంగా లాగారు. స్వామి వారి స్మారక మందిరం రథం వద్దకు లాగి అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి నుంచి తిరిగి ఆలయం చేర్చారు. వేడుకలను తిలకించడానికి భక్తులు పోటెత్తారు. పోలీసులు గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు. తిరుణాల సందర్భంగా గ్రామ ప్రజలు బంధుమిత్రులతో కలిసి పిండివంటలతో పండుగ జరుపుకున్నారు. కుడా చైర్మన్‌ కోట్ల హర్షవర్దన్‌ రెడ్డి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Updated Date - 2023-12-10T23:32:49+05:30 IST