పట్టు పరిశ్రమ శాఖలో పలువురికి పదోన్నతి

ABN , First Publish Date - 2023-09-04T00:18:21+05:30 IST

కర్నూలు జిల్లాలో పట్టు పరిశ్రమ శాఖలో పలువురు సీనియర్లకు పదోన్నతి లభించింది.

పట్టు పరిశ్రమ శాఖలో పలువురికి పదోన్నతి

కర్నూలు(అగ్రికల్చర్‌), సెప్టెంబరు 3: కర్నూలు జిల్లాలో పట్టు పరిశ్రమ శాఖలో పలువురు సీనియర్లకు పదోన్నతి లభించింది. పట్టు పరిశ్రమ శాఖ జిల్లా అధికారి కార్యాలయంలో అసిస్టెంట్‌ సెరికల్చర్‌ ఆఫీసర్‌గా పని చేస్తున్న కుసుమ కుమారికి సెరికల్చర్‌ ఆఫీసర్‌గా పదోన్నతి లభించింది. ఆమె ఆత్మకూరు ఏడీ ఆఫీసుకు బదిలీపై వెళ్లారు. కర్నూలు జిల్లాలో టెక్నికల్‌ అధికారులుగా పని చేస్తున్న ప్రసాదరావు, ఆనందరావు, లింగమూర్తిలకు అసిస్టెంట్‌ సెరికల్చర్‌ ఆఫీసర్లుగా పదోన్నతులు వచ్చాయి. వీరు నంద్యాల జిల్లాకు బదిలీపై వెళ్లారు. నంద్యాల జిల్లాలో టెక్నికల్‌ అధికారులు మహబూబ్‌ బాషా, రమణయ్య, జీవీ రమణారెడ్డి, విజయకుమార్‌, సోమన్నలకు అసిస్టెంట్‌ సెరికల్చర్‌ ఆఫీసర్లుగా పదోన్నతి లభించింది. వీరు కర్నూలుకు బదిలీపై వచ్చారు.

Updated Date - 2023-09-04T00:18:21+05:30 IST