‘మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి’
ABN , First Publish Date - 2023-03-18T00:11:55+05:30 IST
మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం కలెక్టరేట్ ఎదుట సీఐటీయూ ఆధ్వ ర్యంలో ధర్నా చేశారు.

కర్నూలు(న్యూసిటీ), మార్చి 17: మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం కలెక్టరేట్ ఎదుట సీఐటీయూ ఆధ్వ ర్యంలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి అంజి బాబు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కాంట్రాక్టు కార్మికులకు రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. క్యాబ్ డ్రైవర్లకు కనీస వేతనం రూ.18,500 ఇవ్వాలని, ఇం జనీరింగ్ కార్మికులకు హె ల్త్ అలవెన్సు మంజూరు చేయాలన్నారు. ప్రస్తుతం జరుగుతున్న శాస నసభ సమావేశాల్లో కార్మికులకు గురించి చర్చించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమం లో నగర కార్యదర్శి సాయిబాబా, విజయ్, రమీజాబీ, సుధాకరప్ప పాల్గొన్నారు.