రగ్బీ ఫైనల్స్‌కు ప్రకాశం, కర్నూలు జట్లు

ABN , First Publish Date - 2023-02-02T00:49:44+05:30 IST

66వ రాష్ట్ర స్థాయి అండర్‌-14 బాలబాలికల రగ్బీ పోటీలలో బాలుర విభాగంలో ప్రకాశం, బాలికల విభాగంలో కర్నూలు జట్లు పైనల్స్‌కు చేరాయి.

రగ్బీ ఫైనల్స్‌కు ప్రకాశం, కర్నూలు జట్లు

కర్నూలు(స్పోర్ట్స్‌), ఫిబ్రవరి 1: 66వ రాష్ట్ర స్థాయి అండర్‌-14 బాలబాలికల రగ్బీ పోటీలలో బాలుర విభాగంలో ప్రకాశం, బాలికల విభాగంలో కర్నూలు జట్లు పైనల్స్‌కు చేరాయి. బుధవారం నగర శివారులోని ఆదర్శ విద్యామందిరంలో జరిగిన బాలబాలికల క్వార్టర్స్‌ ఫైనల్స్‌, సెమీ ఫైనల్స్‌ పోటీల ఫలితాల వివరాలను స్కూల్‌ గేమ్స్‌ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ జోసెఫ్‌ లక్ష్మయ్య తెలిపారు. బాలుర విభాగం సెమీ ఫైనల్‌ పోటీల్లో కర్నూలు జట్టు, కడప జిల్లా జట్టుపై 6-2 స్కోరుతో విజయం సాధించగా.. మరో పోటీల్లో ప్రకాశం జిల్లా జట్టు విశాఖపట్నం జిల్లా జట్టుపై 4-2 స్కోరుతో గెలిచి పైనల్స్‌ పోటీలకు చేరాయి. బాలికల విభాగంలో కడప జిల్లా జట్టు శ్రీకాకుళం జిల్లా జ ట్టుపై హోరాహోరీగా పోరాడి 3-2 స్కోరోతో గెలవగా.. ప్రకాశం జిల్లా జట్టు కృష్ణా జట్టుపై 4-2 స్కోరుతో గెలిచి పైనల్స్‌ పోటీల్లో చేరాయి.

Updated Date - 2023-02-02T00:49:48+05:30 IST