ఘనంగా పెరియార్ రామస్వామి జయంతి
ABN , First Publish Date - 2023-09-18T00:43:15+05:30 IST
పెరియార్ రామస్వామి 114వ జయంతిని బీఎస్పీ నందికొట్కూర్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ స్వాములు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

పాములపాడు, సెప్టెంబరు 17 : పెరియార్ రామస్వామి 114వ జయంతిని బీఎస్పీ నందికొట్కూర్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ స్వాములు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆదివారం పాములపాడులో పెరియార్ చిత్రపటానికి సేవాభారతి అధ్యక్షుడు షర్ఫద్దీన్ పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్రీల హక్కులకోసం, సాంఘిక సమానత్వం దిశగా ఉద్యమాలు నడిపి హేతుబద్దతకు కొలమానంగా సంఘసంస్కర్తగా, రాజకీయవేత్తగా, అణిచివేత అనేది ఎ స్థాయిలో ఉన్న అదినాకు బద్ద శత్రువేనని గర్జించిన ద్రవిడ సూర్యుడు పెరియార్ రామస్వామి అని కొనియాడారు. ప్రభాకర్, సాయికృష్ణ, దానియేలు, మహేశ్, శేక్షావలి, తదితరులు పాల్గొన్నారు.