పంచాయతీరాజ్ ఇంజనీర్ల నిరసన
ABN , First Publish Date - 2023-03-19T00:19:11+05:30 IST
తమ సమస్యలను ప్రభుత్వ పరిష్కరిం చాలని కోరుతూ శనివారం జిల్లా పరిషత్ ఆవరణలోని విశ్వేశ్వరయ్య విగ్రహం ఎదుట మధ్యాహ్న భోజన సమయంలో పీఆర్ ఇంజనీర్లు నల్లబ్యాడ్జీలతో నిర సన వ్యక్తం చేశారు.

కర్నూలు(న్యూసిటీ), మార్చి 18: తమ సమస్యలను ప్రభుత్వ పరిష్కరిం చాలని కోరుతూ శనివారం జిల్లా పరిషత్ ఆవరణలోని విశ్వేశ్వరయ్య విగ్రహం ఎదుట మధ్యాహ్న భోజన సమయంలో పీఆర్ ఇంజనీర్లు నల్లబ్యాడ్జీలతో నిర సన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్ ఇంజనీర్ల అసోసి యే షన్ జిల్లా కార్యదర్శి సతీష్ కుమార్ మాట్లాడుతూ ఉద్యోగుల న్యాయమైన కోర్కెలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్త పిలుపు లో భాగంగా వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయ న తెలిపారు. కార్యక్రమంలో రాయలసీమ జోనల్ కార్యదర్శి పీవి.సుధాకర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు ఈరన్న, పీఐయూ ఈఈ రామక్రిష్ణారెడ్డి, డీఈలు నాగిరెడ్డి, శిల్పాశ్రీ, జేఈలు మురళి, విజయభాస్కర్, చంద్రశేఖర్‌రెడ్డి, ఏఈలు సుజనప్రి య, మంజుల తదితరులు పాల్గొన్నారు.