కొనసాగుతున్న టీడీపీ నిరసన దీక్షలు
ABN , First Publish Date - 2023-09-18T00:36:08+05:30 IST
చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ టీడీపీ శ్రేణులు చేపట్టిన దీక్షలు ఆదివారం కూడా కొనసాగాయి.

ఆళ్లగడ్డ, సెప్టెంబరు 17: చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ టీడీపీ శ్రేణులు చేపట్టిన దీక్షలు ఆదివారం కూడా కొనసాగాయి. మాజీ మంత్రి అఖలప్రియ, భార్గవ్‌రామ్‌నాయుడు దంపతులు పిలుపునిచ్చారు. పట్టణంలోని ఇంటి వద్ద వారు ఆదివారం నిరాహర దీక్ష చేపట్టారు. ముందుగా అఖిలప్రియ పట్టణంలోని సీఎస్‌ఐలో చంద్రబాబునాయుడు విడుదల కావాలని కోరుతూ ప్రార్థనలు చేశారు. శిరివెళ్ల మండల టీడీపీ నాయకులు కాటంరెడ్డి శ్రీకాంతరెడ్డి, యామా గురప్ప, ఉయ్యాలవాడ నారాయణరెడ్డి, అనంత రామసుబ్బారెడ్డి, ఆకుల వెంకటసుబ్బయ్య, యువకులు పాల్గొన్నారు.
డోన్: పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద టీడీపీ ఆధ్వర్యంలో డోన్ ఇన్‌చార్జి ధర్మవరం సుబ్బారెడ్డితో పాటు న్యాయవాదులు ఆదివారం దీక్షలో కూర్చున్నారు. నాయకులు శ్రీనివాసులు యాదవ్, న్యాయవాదులు ఆలా మల్లికార్జున రెడ్డి, శ్రీనివాసభట్టు, భాస్కర్, ఎస్‌టీ హరున్, రామలింగయ్య, ఆంజనేయగౌడు, చిన్న నాగిరెడ్డి, ఆలా శ్రీధర్, మధుసూదన్ గౌడు, లోకేశ్వరగౌడు, క్రిష్ణప్రసాద్, నజీర్, రఫీ, మదనగోపాల్, కవీశ్వరుడు, బాల మద్దయ్య పాల్గొన్నారు.
బేతంచెర్ల: పట్టణంలోని దుర్గాపేట కొత్త బిల్డింగులో ఉన్న హోసన్నా చర్చిలో ప్రార్థనలు చేశారు. నాయకులు నాగరాజు, ఎల్లనాగయ్య, బుగ్గన ప్రసన్నలక్ష్మి, షేక్షావలి చౌదరి, తిరుమలేష్ చౌదరి, రూబెన్, రాముడు, వార్డు కౌన్సిలర్లు రామాంజనేయులు, రామ్మూర్తి, నంద్యాల మధు, మాజీ ఎంపీటీసీ సభ్యులు జాకీరుల్లా భేగ్, ఫయాజ్, సుమంత్, అంజి పాల్గొన్నారు.
బనగానపల్లె: పట్ణణంలోని బీసీ గుర్రెడ్డి కాంప్లెక్స్ ఆవరణంలో నారా చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ ఆధ్వర్యంలో రిలే దీక్ష చేపట్టారు. జనసేన ఇన్‌చార్జి భాస్కర్ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు, న్యాయవాది కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో లాయర్లు దీక్షకు సంఘీభావం ప్రకటించారు. దీక్షలో పాల్గొన్న బీసీ జనార్దన్‌రెడ్డి, ఇతర టీడీపీ నాయకులకు నిమ్మరసం ఇచ్చి బీసీ ఇందిరమ్మ దీక్షను విరమింపజేశారు. నాయకులు రామకృష్ణారెడ్డి, పీవీ కుమార్‌రెడ్డి, పట్టణ ఉపసర్పంచ్ బురానుద్దీన్, అన్వర్‌సాహెబ్, పాతపాడు సర్పంచ్ మహేశ్వరరెడ్డి, మిట్టపల్లె సర్పంచ్ తులసిరెడ్డి, శ్రీనయ్య, బొబ్బలగోపాల్‌రెడ్డి, భూషన్న, కృష్ణానాయక్, ఖాదర్, అల్లీహుస్సేన్, మద్దిలేటిరెడ్డి, కాట్రెడ్డి మల్లికార్జునరెడ్డి, గుండం మల్లికార్జునరెడ్డి కాశీంబాషా, వెంగన్న, అల్తాప్‌హుస్సున్, ఆంజనేయులు, పూలకలాం, సలాం, ఇస్మాయిల్‌ఖాన్ పాల్గొన్నారు. బీసీ ఇందిరమ్మ బనగానపల్లె ఆర్‌సీఎం(మదర్‌థెరిస్సా) చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
దొర్నిపాడు: భాగ్యనగరం, రామచంద్రాపురం, కొండాపురం, చాకరాజువేముల గ్రామాల్లో చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ర్యాలీలు చేపట్టారు. అనంతరం ఆళ్లగడ్డలో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, భార్గవ్‌రామ్ నాయుడు, భూమా జగత్‌విఖ్యాతరెడ్డి చేపట్టిన నిరహారదీక్షలో సంఘీభావంగా మద్దతు తెలుపుతూ దీక్షలో పాల్గొన్నారు. నాయకులు సురేంద్ర, దయానంద రావు, వెంకట్‌నాయుడు, చౌడయ్య, శివారెడ్డి, అమరసింహారెడ్డి, పవన్ పాల్గొన్నారు.
చాగలమర్రి: ఆళ్లగడ్డలో మాజీ మంత్రి అఖిలప్రియ నిరసన దీక్షకు చాగలమర్రి నాయ కులు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. నరసింహా రెడ్డి, శేఖర్‌రెడ్డి, గోపాల్, సురేష్ కుమార్ రెడ్డి, మహబూబ్‌బాషా, రామచంద్రారెడ్డి పాల్గొన్నారు.
శిరివెళ్ల: టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుపై టీడీపీ నాయకులు మండిపడ్డారు. టీడీపీ మండల కన్వీనర్ కాటంరెడ్డి శ్రీకాంత్‌రెడ్డిని బోయలకుంట్లలో జనసేన మండల కన్వీనర్ పసుల నరేంద్ర యాదవ్, జనసైనికులు కలిశారు. జనసేన నాయకులు జమాల్ బాషా, అశోక్, రాజశేఖర్, చంద్ర, సిద్ధు, నందు, భాస్కర్ పాల్గొన్నారు.