టీడీపీ అధికారంలోకి రాగానే ప్రాజెక్టులు పూర్తి చేస్తాం

ABN , First Publish Date - 2023-03-20T00:18:15+05:30 IST

టీడీపీ అధికారంలోకి రాగానే రాయలసీమలో కాకుండా రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తామని టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు, కేంద్ర మాజీమంత్రి కోట్ల జయసూర్యప్రకా్‌షరెడ్డి అన్నారు.

టీడీపీ అధికారంలోకి రాగానే ప్రాజెక్టులు పూర్తి చేస్తాం

టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు కోట్ల

కోడుమూరు, మార్చి 19: టీడీపీ అధికారంలోకి రాగానే రాయలసీమలో కాకుండా రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తామని టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు, కేంద్ర మాజీమంత్రి కోట్ల జయసూర్యప్రకా్‌షరెడ్డి అన్నారు. స్థానిక పంచాయతీ బోర్డు కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికలతో వైసీపీ పతనం మొదలైందని అన్నారు. వైసీపీతో విసుగు చెందిన ప్రజలు మార్పు కోరుకొంటున్నారు. వైసీపీ ప్రభుత్వ పాలన నచ్చలేదని నిరుద్యోగులు, యువత ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్పష్టమైన సందేశం ఇచ్చారని గుర్తు చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీని గెలిపించేందుకు ప్రజలు ఎదురు చూస్తాన్నారని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసే దమ్ము, ధైర్యం వైసీపీకి ఉందా అని సవాల్‌ విసిరారు. ప్రస్తుతం కొంత మంది ఉద్యోగుస్తులకు ఇంత వరకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఈ వైసీపీ ప్రభుత్వం ఉందని విమర్శించారు. కార్యక్రమంలో సర్పంచు భాగ్యరత్న, తెలు గు మహిళ రాష్ట్ర అధికార ప్రతనిధి సీబీలత, టీడీపీ మండల కన్వీనర్‌ కోట్ల కవితమ్మ, టీడీపీ నాయకులు మాజీ సర్పంచు కేయి రాంబాబు, మాజీ సింగిల్‌విండో అధ్యక్షుడు మధుసూధన్‌రెడ్డి, హేమాద్రిరెడ్డి, లక్ష్యయ్యశెట్టి, కేయి రఘుబాబు, ఎల్లప్పనాయుడు, ఆంధ్రయ్య, తిరుమల్‌నాయుడు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-20T00:18:15+05:30 IST