పాత పెన్షన్‌ విధానమే కావాలి

ABN , First Publish Date - 2023-09-26T00:39:24+05:30 IST

ఉద్యోగ, ఉపాధ్యాయులకు పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్‌ చేశాయి.

పాత పెన్షన్‌ విధానమే కావాలి

జీపీఎస్‌ బిల్లును ఉపసంహరించుకోవాలి

కలెక్టరేట్‌ ఎదుట ఉద్యోగ, ఉపాధ్యాయుల నిరసన

కర్నూలు(ఎడ్యుకేషన్‌), సెప్టెంబరు 25: ఉద్యోగ, ఉపాధ్యాయులకు పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్‌ చేశాయి. ఫ్యాప్టో, పోర్టు, ఏపీసీపీఎస్‌ఈఏ, ఏపీసీపీఎస్‌ యూఎస్‌ సంఘాల ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరే ట్‌ ఎదుట ఉద్యోగ, ఉపాధ్యాయులు నిరసన కార్యక్ర మం చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఫ్యాప్టో కో చైర్మన్‌ కాకే ప్రకాష్‌ రావు మాట్లాడుతూ వైఎస్‌ జగన్మో హన్‌ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్న రోజుల్లో సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చి మర్చిపోయారని ఆరోపించా రు. రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జి.హృదయరాజు మాట్లా డుతూ సీఎం పాత పెన్షన్‌ అమలు చేయకపోగా.. సీపీఎస్‌ స్థానంలో మంత్రి మండలి జీపీఎస్‌ బిల్లుకు ఆమోదం తెలపడం అన్యాయమని అన్యాయమన్నారు. జిల్లా ఫ్యాప్టో చైర్మన్‌ ఎస్‌.గోకారి మాట్లాడుతూ రాజ స్థాన్‌, చత్తీస్‌ఘడ్‌, పంజాబ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, సిక్కిం రాష్ట్రాల్లో ఉద్యోగ, ఉపాధ్యాయుల భద్రత కోసం సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని అమ లు చేశారని తెలిపారు. ఆ రాష్ట్రాల్లో పాత పెన్షన్‌ విధానం సాధ్యమైనప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఎందుకు సాధ్యం కాలేదని ప్రశ్నించారు. జీపీఎస్‌ బిల్లును శాసనసభలో పెట్టిన రోజు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో అసెంబ్లీ ముట్టడికైనా వెనుకాడబోమని హెచ్చరించారు. జీపీఎస్‌ను అమలు చేస్తే భవిష్యత్తులో ఉద్యోగ, ఉపాధ్యాయులకు తీవ్ర నష్టం జరుగుతుం దని డీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు కరెకృష్ణ అన్నారు. అనంతరం స్పందన కార్యక్ర మంలో ఉన్న జేసీ నారపురెడ్డి మౌర్యకు ఉద్యోగ, ఉపాధ్యాయుల సంఘాల నాయకులు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో ఏపీసీపీఎస్‌ ఈఏ గౌరవాధ్యక్షుడు లింగారెడ్డి, జిల్లా పోర్టు చైర్మన్‌ ధనుంజయరెడ్డి, యుటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి సురేష్‌ కుమార్‌, ఎస్టీయూ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి సి. నాగరాజు, ఏపీటీఎప్‌ (257) రాష్ట్ర కార్యదర్శి రవికుమార్‌, ఆప్టా రాష్ట్ర కార్యదర్శి మధుసూదన్‌ రెడ్డి, డీటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి జి.చంద్రశేఖర్‌, ఏపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు రంగన్న, ఏపీటీఎఫ్‌ (1938) జిల్లా అధ్యక్షుడు ఎస్‌ఇస్మాయిల్‌ తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులపై బలవంతంగా జీపీఎస్‌ విధానాన్ని రుద్దడం అన్యాయమని ఏపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు రంగన్న అన్నారు. ఈ విధానాన్ని తేవడం అంటే ఉద్యోగ, ఉపాద్యాయులను నమ్మించి మోసం చేయడమేనని అన్నారు.

Updated Date - 2023-09-26T00:39:24+05:30 IST