Share News

న్యాయ విశ్వ విద్యాలయం ఏర్పాటు చేస్తాం

ABN , First Publish Date - 2023-11-20T00:40:14+05:30 IST

కర్నూలులో న్యాయ విశ్వవిద్యా లయం ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి అన్నారు.

న్యాయ విశ్వ విద్యాలయం ఏర్పాటు చేస్తాం

కర్నూలు(కలెక్టరేట్‌), నవంబరు 19: కర్నూలులో న్యాయ విశ్వవిద్యా లయం ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి అన్నారు. ఆదివారం కల్లూరు మండలం లక్ష్మీపురంలోని న్యాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయబోయే స్థలాన్ని పరిశీలించారు. నేషనల్‌ లా యూనివర్సిటీ ఏర్పాటు చేస్తే దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన లా విద్యార్థులు ఇక్కడ న్యాయ విద్యను అభ్యసించేందుకు వీలుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఆర్‌అండ్‌బీ జయరామిరెడ్డి ఆర్‌అండ్‌బీ ఎగ్జిక్యూ టివ్‌ ఇంజనీర్‌ శ్రీధర్‌ రెడ్డి, పోలిస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజ నీర్‌ నిర్మల్‌ కుమార్‌, స్వామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-11-20T00:40:17+05:30 IST