దిగుబడి లేని వరి
ABN , First Publish Date - 2023-01-18T00:42:10+05:30 IST
ఈ ఏడాది వరి దిగుబడి తగ్గింది. దీనికి తోడు పండిన పంటకు గిట్టుబాటు ధర లభించడం లేదు.
గిట్టుబాటు ధర కూడా లేదు
క్వింటం వరి రూ. 3000
ఆందోళనలో అన్నదాతలు
గోనెగండ్ల, జనవరి 17: ఈ ఏడాది వరి దిగుబడి తగ్గింది. దీనికి తోడు పండిన పంటకు గిట్టుబాటు ధర లభించడం లేదు. దీంతో అన్నదాత నష్టపో తున్నాడు. ఈ ఏడాది పంటకు సరిపడ నీరు పుష్కలంగా ఉన్నా.. పండిన పంటకు గిట్టుబాటు ధర లభించలేదు. పెట్టుబడుల పెరిగాయి. దిగుబడి మాత్రం అన్నదాత ఆశించినంత మేర లేదు. గోనెగండ్ల మండలంలో దాదాపు 1000 వేల ఎకరాల్లో వరి పంటను సాగు చేశారు. గాజులదిన్నె ప్రాజెక్టు కింద ఈ ఏడాది అఽధికంగా వరి సాగు అయింది. గాజులదిన్నె, హెచ్ కైర వాడి, కులుమాల, పుట్టపాశం, వేముగోడు, తిప్పనూరు, అలువాల, వీరంపల్లి, గోనెగండ్ల, పెద్దమరివీడు, చిన్నమరివీడు, పెద్దనేలటూరు గ్రామల్లో అధికంగా సాగు చేశారు.
ఎకరాకు పెట్టుబడి రూ. 45వేల పైమాటే
ఎకరం వరి సాగుకు పెట్టుబడి రూ. 40 వేల నుంచి రూ. 45వేలకు పైగా ఉంటోంది. వరి నార కూడా ఈ ఏడాది అధిక ధర పలికింది. దిగు బడి ఎకరం కూ 15 క్వింటాళ్ల నుంచి 20 క్వింటాళ్ల లోపే ఉంది. క్వింటం వరి ధర రూ. 3000 మాత్రమే పలుకుతోంది. దీంతో సాగు చేసిన రైతుకు నష్టం వాటిల్లుతుంది. ఇక కౌలుకు భూమి తీసుకొని సాగు చేసిన రైతన్న పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఎకరం పొలానికి 13 బస్తాల నుంచి 15 బస్తాల వరకు కౌలు కింద యజమానికి ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకు న్నారు. పండిన పంటలో సగం ధాన్యం కౌలు కింద పోతే మిగిలిన ధాన్యం రైతులకు వస్తుంది. ఎకరానికి దాదాపు రూ. 10వేలు నష్టం వస్తుందని అన్న దాత ఆవేదన చెందుతున్నాడు. మార్కెట్ గిట్టుబాటు ధర లేక పోవడంతో పొలాల్లో, ఇండ్లలో పండిన పంటను నిలువ చేసుకొని ధర కోసం ఎదురు చూస్తున్నారు. కౌలు రైతులు, చిన్న, సన్నకారు రైతులు చేసిన అప్పులు కట్ట మని వడ్డీ వ్యాపారులు ఒత్తిడి తెస్తున్నారు. ఎకరా పంట మిషన్ ద్వారా నూర్పిడి చేయడానికి గంటకు రూ.4000 వసూలు చేస్తుస్తున్నారు. దీనికి ఎకరా కు రెండున్నర గంటల సమయం పడుతుంది.
పెట్టుబడి కూడా రావటం లేదు
ఎకరం పొలంలో వరి పంట సాగు చేశాను. 15 బస్తా లు వరి దిగుబడి వచ్చింది. పెట్టుబడి రూ. 30వేలు అయింది. చేతి నుంచి మరో రూ. 15 వేలు అప్పు చేయా ల్సి వచ్చింది. ఈ ఏడాది దిగుబడి చాల తగ్గిపోయింది.
- హుసేన్, రైతు ఐరన్‌బండ