గార్గేయపురంలో ‘నా మట్టి- నా దేశం’
ABN , First Publish Date - 2023-09-03T00:34:50+05:30 IST
కర్నూలు మండలం గార్గేయ పురం గ్రామంలో బీజేపీ ఆధ్వర్యంలో ‘నా మట్టి - నా దేశం కార్యక్రమం’ శనివారం నిర్వహించారు.
కర్నూలు(ఎడ్యుకేషన్), సెప్టెంబరు 2: కర్నూలు మండలం గార్గేయ పురం గ్రామంలో బీజేపీ ఆధ్వర్యంలో ‘నా మట్టి - నా దేశం కార్యక్రమం’ శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ హాజరై మాట్లాడుతూ దేశ ప్రజలు బలంగా ఉం టేనే దేశం అభివృద్ధి వైపు వెళుతుందని అన్నారు. మన మట్టిని మన తల్లితో పోల్చు కుంటామని, అలాగే దేశాన్ని కూడా తల్లితో పోల్చుకుని భర తమాతగా పూజించుకుంటున్నామన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృ త్వంలో భారతదేశం ప్రపంచ దేశాల్లోనే బలమైన అభివృధ్ది దేశంగా మారు తుందన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు 90 శాతం నిధు లను కేంద్రమే మంజూరు చేస్తుందన్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో సోలార్ ప్లాంటు, డీఆర్‌డీవో ప్రాజెక్టు ఏర్పాటైందంటే అది కేంద్ర ప్రభుత్వ చలు వేనని టీజీ వెంకటేశ్ తెలిపారు. అనంతరం కర్నూలు మండలం వెం కాయపల్లె ఎల్లమ్మ అమ్మవారిని ఆయన శనివారం దర్శించుకున్నారు. సొంత నిధులతో నిర్మించిన మినరల్ వాటర్ ప్లాంట్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ట్రస్టు బోర్డు చైర్మన్ చంద్రుడు టీజీని శాలువ కప్పి సత్కరిం చారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామస్వామి, కోడుమూరు నియోజకవర్గ ఇన్‌చార్జి ప్రేమ్ కుమార్ పాల్గొన్నారు.