‘ఎంపీని తొలగించాలి’

ABN , First Publish Date - 2023-06-03T00:02:57+05:30 IST

బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్‌ చరణ్‌ సింగ్‌ను పార్లమెంట్‌ సభ్యత్వం నుంచి తొలగించి అరెస్టు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి రంగనాయుడు, జిల్లా సహాయ కార్యదర్శి బాబాఫకృద్దీన్‌ డిమాండ్‌ చేశారు.

‘ఎంపీని తొలగించాలి’
నంద్యాలలో ధర్నా చేస్తున్న సీపీఐ నాయకులు

నంద్యాల టౌన్‌, జూన్‌ 2: బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్‌ చరణ్‌ సింగ్‌ను పార్లమెంట్‌ సభ్యత్వం నుంచి తొలగించి అరెస్టు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి రంగనాయుడు, జిల్లా సహాయ కార్యదర్శి బాబాఫకృద్దీన్‌ డిమాండ్‌ చేశారు. మహిళా క్రీడాకారిణులపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎంపీ బ్రీజ్‌ భూషణ్‌ చరణ్‌సింగ్‌పై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దౌర్భగ్యమంటూ శుక్రవారం పట్టణంలోని శ్రీనివాస సెంటర్‌లో నిరసన కార్యక్రమం చేపట్టారు. సీపీఐ నాయకులు మాట్లాడుతూ దేశ రెజ్లింగ్‌ క్రీడాకారిణులపై సమాఖ్య అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ ఢిల్లీలో నిరసనలు చేపడుతున్న ఇప్పటి వరకు బీజేపీ ప్రభుత్వం ఎలాంటి విచారణ చేపట్టకుండా, నిరసన చేస్తున్న క్రీడాకారిణులపై లాఠీచార్జి చేస్తూ అక్రమ అరెస్టులకు పాల్పడడం దారుణమన్నారు. సీపీఐ నాయకులు శ్రీనివాసులు, ప్రసాద్‌, సోమన్న, నాగరాముడు, నారాయణమ్మ, రియాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

జూపాడుబంగ్లా: రెజ్లర్లపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌పై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని శుక్రవారం జూపాడుబంగ్లాలోని కేజీరోడ్డుపై బీఎస్పీ ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. ఆ పార్టీ నాయకుడు స్వాములు మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటినుంచి దళితులు, మైనార్టీలు, మహిళలపై దాడులు పెరిగిపోయాయని ఆరోపించారు. దేశానికి స్వర్ణపథకాలు సాధించి పెట్టిన క్రీడాకారిణిలపై లైంగిక వేఽధింపులకు పాల్పడటం దారుణమన్నారు. రెజ్లర్లు ఆందోళన చేస్తున్న మోదీ పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో లోకేశ్‌, చిన్న, రవికుమార్‌, ప్రభాకర్‌, శివరాం, అరవింద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-03T00:02:57+05:30 IST