వసతి గృహాల్లో మెనూ పాటించాలి
ABN , First Publish Date - 2023-09-23T00:19:54+05:30 IST
జిల్లాలోని కస్తూర్బా గాంధీ, ఆదర్శ పాఠశాలల బాలికల వసతి గృహాల్లో మెనూ తప్పనిసరి గా పాటించాలని ఎస్‌ఎస్‌ఏ ఏపీసీ డా.వేణుగోపాల్ అన్నారు.
కర్నూలు(ఎడ్యుకేషన్), సెప్టెంబరు 22: జిల్లాలోని కస్తూర్బా గాంధీ, ఆదర్శ పాఠశాలల బాలికల వసతి గృహాల్లో మెనూ తప్పనిసరి గా పాటించాలని ఎస్‌ఎస్‌ఏ ఏపీసీ డా.వేణుగోపాల్ అన్నారు. శుక్రవారం స్థానిక సమగ్ర శిక్ష కార్యాలయంలోని సమావేశ భవనంలో కేజీబీవీ ప్రిన్సిపాల్స్, ఆదర్శ పాఠశాలల వార్డెన్లకు సమీక్ష సమావేశం నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వసతి గృహాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది, సచివాలయ ఆరోగ్య సిబ్బంది ఫోన్ నెంబర్లను వసతి గృహాల్లో నోటీసు బోర్డులో ఉంచా లన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బందితో సమన్వయం చేసుకుని విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు చేయించాలని సూచించారు. పాఠశాలల సిబ్బంది సమయపాలన పాటించాలని, రక్తహీనత ఉన్న వారికి పోలిక్ యాసిడ్ మాత్రలను పంపిణీ చేయాలని అన్నారు. ఈ సమావేశంలో ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ కర్రెన్న, డీసీడీవో సునీత, ఏఎంవో ప్రసాద్, అసిస్టెంట్ ఏఎంవో శివశంకర్‌తో పాటు కేజీబీవీల ప్రిన్సిపాల్, ఆదర్శ పాఠశాలల వార్డెన్లు పాల్గొన్నారు.