మెగా డీఎస్సీ విడుదల చేయాలి
ABN , Publish Date - Dec 31 , 2023 | 12:46 AM
మెగా డీఎస్సీని వెంటనే విడుదల చేయాలని టీఎస్‌ఎఫ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారం కర్నూలు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.
కర్నూలు(కలెక్టరేట్), డిసెంబరు 30: మెగా డీఎస్సీని వెంటనే విడుదల చేయాలని టీఎస్‌ఎఫ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారం కర్నూలు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. టీఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షు డు రామరాజు అధ్యక్షతన జరిగిన ధర్నానుద్దేశించి టీఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్య క్షుడు రాగిరి చంద్రప్ప మాట్లాడారు. ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని హామీ ఇచ్చారన్నారు. 2018 డీఎస్సీ తర్వాత ఇప్పటి వరకు ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదన్నారు. వెంటనే మెగా డీఎస్సీ విడుదల చేయకపోతే జగన్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడానికి నిరుద్యోగ డీఎస్సీ అభ్యర్థులందరూ ఏకమవుతారని హెచ్చ రించారు. కార్యక్రమంలో టీఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి వెంకటేశ్, జిల్లా సహా య కార్యదర్శి విజయ్ నాయక్, ప్రకాష్, నిరుద్యోగ సంఘం నాయకులు రాజీవ్, ప్రశాంత్, మోహన్ పాల్గొన్నారు.