సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయండి

ABN , First Publish Date - 2023-05-27T00:12:17+05:30 IST

సీఎం పర్యటన ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని కలెక్టర్‌ డాక్టర్‌ సృజన అధికారులను ఆదేశించారు.

సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయండి

అధికారులను ఆదేశించిన కలెక్టర్‌

కర్నూలు, కలెక్టరేట్‌, మే 26: సీఎం పర్యటన ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని కలెక్టర్‌ డాక్టర్‌ సృజన అధికారులను ఆదేశించారు. శుక్రవారం సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి రాక సందర్భంగా జాయింట్‌ కలెక్టర్‌తో కలిసి టెలికా న్ఫరెన్స్‌ ద్వారా ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ కర్నూలు, ఆదోని ప్రాంతాల నుంచి బస్సుల ద్వారా వచ్చే ప్రజలకు పార్కింగ్‌ ప్రదేశం నుంచి సభా ప్రాంగణం వరకు నడిచే దూరం ఎక్కువ లేకుండా చూడాలని ఎస్పీ, జాయింట్‌ కలెక్టర్‌, ఆదోని సబ్‌ కలెక్టర్‌లకు సూచించారు. సభా ప్రాంగణంలో రోలింగ్‌, రహదారుల ప్యాచింగ్‌, హెలిప్యాడ్‌ వద్ద పెండింగ్‌లో ఉన్న పనులు, రోడ్‌ మీదికి డ్రైస్‌ వాటర్‌ రాకుండా చేయాల్సిన పనులను పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈని కలెక్టర్‌ ఆదేశించారు. డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌ బస్సులు తిప్పిన తర్వాత వారు గుర్తించిన సమస్యలను కలెక్టర్‌ దృష్టికి తీసుకొని రాగా, ఆ సమస్యలను కూడా ఈ రోజు లోపు పరిష్కరించాలని ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈని కలెక్టర్‌ ఆదేశించారు. సభా ప్రాం గణం, హెలిప్యాడ్‌ వద్ద పిచ్చి మొక్కలు తీసివేయాలని డీపీవోని ఆదేశించారు. సభా ప్రాంగణం వద్ద ప్రజలకు ఇబ్బంది కలగకుండా తాగునీరు ఏర్పాటు చేయాలని ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులను ఆదేశించారు. వేదిక, ఇతర ఏర్పాట్లపై సమీక్షించారు. ఎస్పీ మాట్లాడుతూ కర్నూలు, ఆదోని ప్రాంతాల నుంచి వచ్చే బస్సులకు పార్కింగ్‌ స్థలాలు గుర్తించామని కలెక్టర్‌కు వివరించారు. జాయింట్‌ కలెక్టర్‌ నారపురెడ్డి మౌర్య మాట్లాడుతూ స్టేజ్‌ ఏర్పాటుకు సంబంధించిన పనులను శుక్రవారం లోపు పూర్తి చేయాలని ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈని ఆదేశించారు. టెలికాన్ఫరెన్స్‌లో ఆదోని సబ్‌ కలెక్టర్‌ అభిషేక్‌ కుమార్‌, పత్తికొండ ఆర్డీవో మోహన్‌దాస్‌, జిల్లా, మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

బ్యాంకర్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలి: కలెక్టర్‌

కర్నూలు(న్యూసిటీ): వ్యవసాయం, ఎంఎస్‌ఎంఈలకు సంబంధించిన రుణాల విషయంలో బ్యాంకర్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్‌ జి.సృజన ఆదేశించారు. శుక్రవారం జిల్లా పరిషత్‌ మినీ సమావేశ భవనంలో జరిగిన బ్యాంకర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ బ్యాంకుల కంటే ప్రైవేటు బ్యాంకులు ఎక్కువ బాధ్యతతో పని చేస్తున్నా యని, ఈ విషయంలో ప్రభుత్వ బ్యాంకులు ముందుకు రావాలని సూచించారు. సమావేశంలో నగర పాలక సంస్థ కమిషనర్‌ ఎస్‌.భార్గవ్‌తేజ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-05-27T00:12:17+05:30 IST