కొలనుభారతి సన్నిధిలో లోకాయుక్త దంపతులు
ABN , First Publish Date - 2023-12-10T23:31:28+05:30 IST
రాష్ట్రంలో ఏకైక జ్ఞాన సరస్వతి అమ్మవారి క్షేత్రమైన కొలనుభారతి అమ్మవారిని లోకాయుక్త జస్టిస్ లక్ష్మణ రెడ్డి దంపతులు శనివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కొత్తపల్లి, డిసెంబరు 10: రాష్ట్రంలో ఏకైక జ్ఞాన సరస్వతి అమ్మవారి క్షేత్రమైన కొలనుభారతి అమ్మవారిని లోకాయుక్త జస్టిస్ లక్ష్మణ రెడ్డి దంపతులు శనివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొలనుభారతి క్షేత్రంలో లోకాయుక్త దంపతులకు ఈఓ మోహన్, తహసీల్దార్ చంద్రశేఖర్ నాయక్, ఎంపీడీవో మేరి, పురోహితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. దర్శన అనంతరం ఆలయ మర్యాదలతో వారిని సత్కరించి భారతిదేవి జ్ఞాపికను అందజేశారు.