అన్నదాతకు అండగా నిలబడదాం

ABN , First Publish Date - 2023-06-02T23:46:53+05:30 IST

అన్నదాతకు అండగా నిలబడదామని కలెక్టర్‌ డా.జి.సృజన అన్నారు.

అన్నదాతకు అండగా నిలబడదాం

కలెక్టర్‌ డా.జి. సృజన

కర్నూలు(అగ్రికల్చర్‌), జూన్‌ 2: అన్నదాతకు అండగా నిలబడదామని కలెక్టర్‌ డా.జి.సృజన అన్నారు. శుక్రవారం కర్నూలు నగర పరిధిలోని సెయింట్‌ క్లారెట్‌ ఇంగ్లీషు మీడియం పాఠశాల ఆవరణలో వైఎస్సార్‌ యంత్రసేవా పథకం మెగా మేళా-2 ద్వారా రైతులకు యంత్రాలు, ట్రాక్టర్లను అందజేశారు. కార్యక్రమానికి ముందు జ్యోతి ప్రజ్వలనతో వైఎస్సార్‌ యంత్రసేవ కార్యక్రమాన్ని కలెక్టర్‌ ప్రారంభించారు. ఇందులో భాగంగా 159 రైతు గ్రూపులకు 96 ట్రాక్టర్లు, ఒక కంబైన్‌ హార్వెస్టర్‌, 442 ఇతర వ్యవసాయ పరికరాల పంపిణీతోపాటు రూ.4.61 కోట్ల సబ్సిడీని 159 రైతు గ్రూపుల బ్యాంకు ఖాతాల్లో కలెక్టర్‌ జమ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న వైఎస్సార్‌ యంత్రసేవ పథకాన్ని రైతులు సక్రమంగా వినియోగించుకుని సాగు ఖర్చులు తగ్గించుకోవాలని విజ్ఞప్తి చేశారు. రైతుల కోసం ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌ రెడ్డి, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ఎర్రబోతుల పాపిరెడ్డి, నగర మేయర్‌ బీవై రామయ్య, మార్కెట్‌ యార్డు చైర్మన్‌ ప్రభాకర్‌రెడ్డి, వ్యవసాయ సలహా మండలి చైర్మన్‌ బెల్లం మహేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-02T23:46:53+05:30 IST