సంఘటితంగా పోరాడుదాం
ABN , First Publish Date - 2023-10-04T00:33:48+05:30 IST
కార్మిక వర్గాన్ని కట్టుబానిసలుగా మార్చే నాలుగు లేబర్ కోడ్లను ప్రభుత్వం రద్దు చేసే వరకు సంఘటితంగా పోరాడాలని కార్మిక సంఘాల నాయకులు పిలుపునిచ్చారు.
కలెక్టరేట్ ఎదుట కార్మిక సంఘాల మానవహారం
కర్నూలు(న్యూసిటీ), అక్టోబరు 3: కార్మిక వర్గాన్ని కట్టుబానిసలుగా మార్చే నాలుగు లేబర్ కోడ్లను ప్రభుత్వం రద్దు చేసే వరకు సంఘటితంగా పోరాడాలని కార్మిక సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. ప్రపంచ కార్మిక సంఘాల సమాఖ్య ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం సీఐటీయూ, ఏఐటీయైుసీ, ఎస్‌యూసీఐల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు పీఎస్. రాధాక్రిష్ణ మాట్లాడుతూ దేశంలోని కార్పొరేట్ శక్తులకు దేశ సంపదను దోచి పెట్టడానికే మోదీ ప్రభుత్వం కార్మిక చట్టాలను మార్చేసిందని అన్నారు. కార్మిక వర్గానికి నష్టదాయకమైన లేబర్ కోడ్లను రద్దు చేయాలని దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 11 కార్మిక సంఘాల ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేసినా కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సందర్భంలో పాలకవర్గాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గం సంఘటిత ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ఎస్. మునెప్ప, ఎస్‌యూసీఐ నాయకులు నాగన్న, నాయకులు సాయిబాబ, విజయ్, చంద్రశేఖర్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.