పట్టు విడవం...పోరు ఆపం

ABN , First Publish Date - 2023-09-28T00:42:27+05:30 IST

పట్టు విడవం..పోరు ఆపం అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ ఆ పార్టీ నాయకులు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహిస్తున్న మేము సైతం సామూహిక రిలే నిరాహారదీక్షలో ప్రతీన బూనారు.

పట్టు విడవం...పోరు ఆపం
ఆత్మకూరు న్యాయవాదుల దీక్షలో బుడ్డా రాజశేఖరరెడ్డి

పట్టు విడవం..పోరు ఆపం అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ ఆ పార్టీ నాయకులు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహిస్తున్న మేము సైతం సామూహిక రిలే నిరాహారదీక్షలో ప్రతీన బూనారు. దీక్షలకు వివిధ వర్గాల, సామాజిక వర్గీయులు మద్దతుగా నిలిచారు. నంద్యాలలో రజక సామాజిక వర్గీయులు సంఘీభావ దీక్ష చేపట్టగా.. ఆత్మకూరులో న్యాయవాదులు దీక్షలు చేశారు. పాణ్యంలో బలిజ సంఘం నాయకులు దీక్షలో కూర్చున్నారు. జనసేన నాయకులు దీక్షా శిబిరాలను సందర్శించి సంఘీభావం తెలిపారు. పాణ్యంలో టీడీపీ శ్రేణులు నల్లశాలువాలు వేసుకొని చెవుల్లో పూలు పెట్టుకొని ప్రభుత్వ చర్యలపై నిరసన తెలిపారు. జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ నిరాహార దీక్షలు బుధవారినికి 15వ రోజుకు చేరాయి.

నంద్యాల (నూనెపల్లె), సెప్టెంబరు 27 : రాష్ట్రంలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌లో అవినీతి జరిగితే రెండు లక్షల మంది ఉపాధి పొందుతారా..? అని టీడీపీ పోలిట్‌ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌, నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి ప్రశ్నించారు. రూ.వందల కోట్లతో శిక్షణ నైపుణ్య కేంద్రాలను స్థాపించి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తే రాజకీయ కుట్రతో తప్పుడు ఆరోపణలు చేసి చంద్రబాబుపై అక్రమ కేసులు మోపడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా భూమా బ్రహ్మానందరెడ్డి ఆధ్వర్యంలో నంద్యాలలో చేపట్టిన రిలేనిరాహార దీక్షలు 15వ రోజూ కొనసాగాయి. రజక సామాజిక వర్గీయులు దీక్షలో పాల్గొన్నారు.

నందికొట్కూరు 27 : స్థానిక పటేల్‌ సెంటర్‌లో నిర్వహిస్తున్న దీక్షల్లో జూపాడుబంగ్లా తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు. మండల కన్వీనర్‌ వెంకటేశ్వర్లు యాదవ్‌ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి టీడీపీ నియోజకవర్గ అధికారప్రతినిధి కాకరవాడ చిన్న వెంకటస్వామి, మైనార్టీ రాష్ట్ర అధికారప్రతినిధి షకీల్‌ అహ్మద్‌, మాజీ పీపీ నాగముని ముఖ్య అతిధులుగా హాజరై మాట్లాడారు. మండల క్లస్టర్‌ ఇన్‌చార్జీ గిరీశ్వర్‌రెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, శివరామిరెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, రమణారెడ్డి, సంపత్‌, శ్రీనివాసులు, మహమ్మద్‌, ఉస్మాన్‌, నందికొట్కూరు క్లస్టర్‌ ఇన్‌చార్జి లాయర్‌ జాకీర్‌ హుస్సేన్‌, వేనుగోపాల్‌, కళాకార్‌, మోహన్‌, రాజన్న, ప్రభుకుమార్‌, అప్సర్‌, ముజీబ్‌, బ్రహ్మయ్య పాల్గొన్నారు.

వైసీపీ అరాచకాలపై మేధావులు మేల్కొనాలి

ఆత్మకూరు : రాష్ట్రంలో వైసీపీ చేస్తున్న అరాచక పాలనపై మేధావులు మేల్కోని పోరాడాల్సిన అవసరం ఆసన్నమైందని శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి పిలుపునిచ్చారు. టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు అరెస్టు నిరసిస్తూ ఆత్మకూరులోని ఆర్టీసీ బస్టాండ్‌ ఎదుట చేపడుతున్న నిరాహారదీక్షల్లో న్యాయవాదులు పాల్గొని నిరసన మద్దతుగా నిలిచారు. దీక్షా శిబిరాన్ని శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి సందర్శించి సంఘీభావం తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఒక్కఛాన్స్‌ పేరుతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన జగన్‌ రాక్షస పాలన కన్నా హీనంగా తన పరిపాలన సాగిస్తున్నాడని విమమర్శించారు. రాచరిక పాలన తరహాలో పోలీసులను అడ్డుపెట్టుకుని దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. జగన్‌కు మళ్లీ అధికారం ఇస్తే కేసులతో కాకుండా హత్యలతో పాలిస్తాడని అన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు, మాజీ మార్కాపురం మున్సిపల్‌ చైర్మన్‌ వక్కలగడ్డ మల్లికార్జున, టీడీపీ మండల, పట్టణాధ్యక్షులు శివప్రసాద్‌రెడ్డి, వేణుగోపాల్‌, నాయకులు యుగంధర్‌రెడ్డి, వెన్నా శ్రీధర్‌రెడ్డి, నాగూర్‌ఖాన్‌, కలిముల్లా, సతీష్‌, పస్పీల్‌ ఉన్నారు. ఈ దీక్షల్లో సీనియర్‌ న్యాయవాదులు కంచర్ల గోవిందరెడ్డి, కే.కేశవరెడ్డి, గిరిరాజు, వెంకటేశ్వర్లు, సుదర్శన్‌, లక్ష్మీనారాయణ, సిద్దిక్‌ అహ్మద్‌, మహబూబ్‌బాష తదితరులు ఉన్నారు.

Updated Date - 2023-09-28T00:42:27+05:30 IST