Share News

అధికార పార్టీకి తొత్తులుగా ఖాకీలు

ABN , First Publish Date - 2023-11-21T23:59:29+05:30 IST

కోసిగి మండల ఐటీడీపీ అధ్యక్షుడు షేక్‌ హుశేన్‌సాబ్‌ను పోలీసులు విచక్షణా రహితంగా కొట్టడంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ స్పందించారు.

అధికార పార్టీకి తొత్తులుగా ఖాకీలు

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌

కోసిగి, నవంబరు 21: కోసిగి మండల ఐటీడీపీ అధ్యక్షుడు షేక్‌ హుశేన్‌సాబ్‌ను పోలీసులు విచక్షణా రహితంగా కొట్టడంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ స్పందించారు. అంబులెన్స్‌ కావాలని చెప్పి హుశేన్‌సాబ్‌ను కోసిగి ఎస్‌ఐ సతీష్‌కుమార్‌, కానిస్టేబుల్‌ సంజీవ్‌ స్టేషన్‌కు తీసుకెళ్లి కొట్టారు. ఇదే అంశంపై పత్రికల్లో మంగళవారం వార్త ప్రచురితమైంది. దీంతో నారా లోకేశ్‌ సోషల్‌ మీడియా వేదికగా కోసిగి పోలీసులపై మండిపడ్డారు. అధికార పార్టీ నేతలకు తొత్తులుగా మారిన కొందరు పోలీసులు ఆ వ్యవస్థకే మచ్చ తెస్తున్నారని అన్నారు. పోలీసులు సీఎం జగన్‌ కిరాయి సైన్యంలా పని చేస్తూ దాడి చేశారన్నారు. గీత దాటిన వారికి ప్రజలే కోరలు పీకుతారని, హుశేన్‌సాబ్‌కు టీడీపీ అండగా ఉంటుందని లోకేశ్‌బాబు సోషల్‌ మీడియా వేదికగా భరోసా ఇచ్చారు.

Updated Date - 2023-11-23T07:48:09+05:30 IST