మహానందిలో కర్ణాటక హైకోర్టు జడ్జి
ABN , First Publish Date - 2023-05-13T00:41:35+05:30 IST
మహానంది క్షేత్రంలో నూతనంగా నిర్మించిన రాహుకేతువు మంటపాన్ని శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి శుక్రవారం ప్రారంభించారు.
మహానంది, మే 12: మహానంది క్షేత్రంలో నూతనంగా నిర్మించిన రాహుకేతువు మంటపాన్ని శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి శుక్రవారం ప్రారంభించారు. మూడు రోజులుగా మంటపం ప్రారంభ పూజలను ఆలయ వేదపండితులు ఘనంగా నిర్వహించారు. పూర్ణాహుతితో ముగింపు పలికారు. తొలి టికెట్‌ను కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రామచంద్ర దంపతులు కొనుగోలు చేసి భక్తులతో కలసి పూజల్లో పాల్గొన్నారు. ఈవో చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.