మంత్రాలయంలో కన్నడ సినీ దర్శకుడు
ABN , Publish Date - Dec 29 , 2023 | 12:43 AM
మంత్రాలయం రాఘవేంద్ర స్వామి దర్శనార్థం కన్నడ ప్రముఖ సినీ దర్శకుడు తరుణ్ సుధీర్ గురువా రం మంత్రాలయానికి వచ్చారు.
మంత్రాలయం, డిసెంబరు 28: మంత్రాలయం రాఘవేంద్ర స్వామి దర్శనార్థం కన్నడ ప్రముఖ సినీ దర్శకుడు తరుణ్ సుధీర్ గురువా రం మంత్రాలయానికి వచ్చారు. ఆయనకు మఠం ఏఏఓ మాధవశెట్టి, మేనేజర్లు ఎస్‌కే శ్రీనివాస రావు, వెంకటేష్ జోషి, జోనల్ మేనేజర్ శ్రీపతి ఆచార్, అసిస్టెంట్ మేనేజర్ ఐపీ నరసింహ మూర్తి ఘనంగా స్వాగతం పలికారు. తరుణ్ సుధీర్ గ్రామదేవత మంచాలమ్మను దర్శించుకుని రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి విశేష పూజలు చేశారు. మఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు శేషవస్త్రం, ఫల, పుష్ప, మంత్రాక్షిం తలు, పరిమళ ప్రసాదం ఇచ్చి ఆశీర్వదించారు. వ్యాసరాజ్ ఆచార్, సూ పరింటెండెంట్ జేపీ స్వామి, జయతీర్థ ఆచార్, బిందు మాధవ్ పాల్గొన్నారు.