‘జర్నలిస్టులకు పాస్‌లు ఇవ్వాలి’

ABN , First Publish Date - 2023-06-03T00:44:46+05:30 IST

జిల్లాలో సీఎం కార్యక్రమాలు జరిగితే జర్నలిస్టులతోపాటూ ఫొటో, వీడియో జర్నలిస్టులకు కూడా పాస్‌లు ఇవ్వాలని ఇండియన్‌ జర్నలిస్ట్స్‌ యూనియన్‌ (ఐజేయూ) జాతీయ సమితి సభ్యుడు గోరంట్ల కొండప్ప, ఆంధ్రప్రదేశ్‌ యూనియన్‌ ఆఫ్‌ వర్కింగ్‌ జర్న లిస్ట్స్‌ (ఏపీయూ డబ్ల్యూజే) జిల్లా గౌరవాధ్యక్షుడు ఎన్వీ సుబ్బయ్య, జిల్లా అధ్యక్షుడు ఈఎన్‌ రాజు, కార్యదర్శి శ్రీనివాసగౌడ్‌లు డిమాండ్‌ చేశారు.

‘జర్నలిస్టులకు పాస్‌లు ఇవ్వాలి’

కర్నూలు(కల్చరల్‌), జూన్‌ 2: జిల్లాలో సీఎం కార్యక్రమాలు జరిగితే జర్నలిస్టులతోపాటూ ఫొటో, వీడియో జర్నలిస్టులకు కూడా పాస్‌లు ఇవ్వాలని ఇండియన్‌ జర్నలిస్ట్స్‌ యూనియన్‌ (ఐజేయూ) జాతీయ సమితి సభ్యుడు గోరంట్ల కొండప్ప, ఆంధ్రప్రదేశ్‌ యూనియన్‌ ఆఫ్‌ వర్కింగ్‌ జర్న లిస్ట్స్‌ (ఏపీయూ డబ్ల్యూజే) జిల్లా గౌరవాధ్యక్షుడు ఎన్వీ సుబ్బయ్య, జిల్లా అధ్యక్షుడు ఈఎన్‌ రాజు, కార్యదర్శి శ్రీనివాసగౌడ్‌లు డిమాండ్‌ చేశారు. శుక్రవారం కలెక్టర్‌ డాక్టర్‌ జి. సృజనకు వినతిపత్రం అందజేశారు. ఈ సం దర్భంగా వారు మాట్లాడుతూ పత్తికొండలో సీఎం కార్యక్రమానికి పాసులు ఇవ్వాలని ఐ అండ్‌ పీఆర్‌ అధికారులను అడిగితే ఇవ్వలేమని చెప్పారని తెలిపారు. అంతేకాక పాస్‌లు ఉన్న వారే సమాచార శాఖ ఏర్పాటు చేసిన బస్సును ఎక్కాలని, లేనివారు దిగిపోవాలని చెప్పి అందరినీ దింపి వెళ్లడం బాధాకరమని అన్నారు. గతంలో ఎప్పడూ ఇలాంటి పరిస్థితి లేదని, భవి షత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కలెక్టర్‌ను కోరారు. దీనిపై స్పందించిన కలెక్టర్‌ మాట్లాడుతూ భవిషత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే రెగ్యులర్‌గా వచ్చే పేపర్లకు మండలానికి ఒక అక్రిడిటేషన్‌ ఇవ్వాలని, రెగ్యు లర్‌గా వచ్చే చిన్న పత్రికలకు నియోజకవర్గానికి ఒక అక్రిడిటేషన్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అలాగే పీడీఎఫ్‌లకు గతంలో లాగే రెండు అక్రిడేషన్లు ఇవ్వాలని కోరారు. జగన్నాథగట్టులో జర్నలిస్టులకు కేటాయించిన స్థలాల్లో నేటికీ ఎర్రమట్టి తవ్వకాలు కొనసాగుతున్నాయని, కఠిన చర్యలు తీసుకోవా లని కోరారు. దీనిపై స్పందించిన కలెక్టర్‌ పక్కనే ఉన్న మైనింగ్‌ డీడీ రాజశే ఖర్‌ను పిలిచి తవ్వకాలు జరగకుండా అడ్డుకోవాలని సూచించారు. కలెక్టర్‌కు వినతి పత్రం ఇచ్చిన వారిలో చంద్రశేఖర్‌, సురేష్‌, అంజి, శివ, రాజ్‌కుమార్‌, అవినాథ్‌, శ్రీనాథ్‌రెడ్డి, రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2023-06-03T00:44:46+05:30 IST