Share News

బీసీలను మోసం చేసిన జగన్‌

ABN , Publish Date - Dec 18 , 2023 | 11:54 PM

రాష్ట్రంలోని బీసీలను ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి మోసం చేశారని బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ఉల్చాల లక్ష్మణ్‌ నాయుడు అన్నారు.

బీసీలను మోసం చేసిన జగన్‌

కర్నూలు(కలెక్టరేట్‌), డిసెంబరు 18: రాష్ట్రంలోని బీసీలను ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి మోసం చేశారని బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ఉల్చాల లక్ష్మణ్‌ నాయుడు అన్నారు. రాష్ట్రంలో 56 బీసీ కుల కార్పొరే షన్లకు నిధులు, విధులు, బీసీ కమిషన్‌కు చట్టబద్ధ్దత కల్పించాలని కోరుతూ సోమవారం కలెక్టరేట్‌ కార్యాలయం ముందు బీజేపీ ఓబీసీ మోర్చా నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ఒక్కొక్క బీసీ కుల కార్పొరేషన్‌కు వేల కోట్లతో నిధులు ఇస్తామని చెప్పి నేటి వరకు ఒక్క రూపాయి కూడా నిధులు ఇవ్వకపోవడం సిగ్గు చేటన్నారు. బీసీ కార్పొ రేషన్‌ చైర్మన్‌, డైరెక్టర్లకు విధులు లేకుండా చేశారని, కేంద్ర ప్రభుత్వం చట్టబద్దత కూడిన ఓబీసీ కమిషన్‌ను నియమించి ఓబీసీల అభ్యున్నతికి కృషి చేస్తుందన్నారు. కానీ సీఎం జగన్‌ ప్రభుత్వం చట్టబద్ధ్దత లేని బీసీ కమిషన్‌ ఏర్పాటు చేశారన్నారు. కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామస్వామి, సూర్యకుమార్‌, రాఘవులు, మాలతి పాల్గొన్నారు.

Updated Date - Dec 18 , 2023 | 11:55 PM