జగన్ ప్రభుత్వం సిగ్గుపడాలి
ABN , First Publish Date - 2023-02-15T01:00:48+05:30 IST
ప్రాజెక్టుల నిర్మాణం కోసం నిధులు ఇవ్వని జగన్ ప్రభుత్వం సిగ్గుపడాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
హాలహర్వి, ఫిబ్రవరి 14: ప్రాజెక్టుల నిర్మాణం కోసం నిధులు ఇవ్వని జగన్ ప్రభుత్వం సిగ్గుపడాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. మంగళవారం గూళ్యం గ్రామంలో వేదవతి ప్రాజెక్టు నిర్మాణం పనుల గురించి ఆయన మాట్లాడారు. వేదవతి ప్రాజెక్టు ఆలూరు, ఆదోని, పత్తికొండ ప్రాంతాలకు జీవనాడి. ఇందుకు రూ.1942 కోట్లు మంజూరు చేశారు. కానీ ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక కేవలం రూ.16 కోట్లు మాత్రమే ఇచ్చారు. హాలహర్వి వద్ద 2 టీఎంసీల జలాశయం నిర్మాణం చేపట్టాలి. భూసేకరణ పనులు సైతం నిలిచి పోయిందని, ఈ ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధి లేదని, కాంట్రాక్టర్లు బిల్లులు రావడం లేదని వెనక్కి వెళ్లిపోతున్నారు. అందువల్ల ఈ ఏడాది 30 నుంచి 40 టీఎంసీల నీరు వృథాగా వెళ్లిపోయాయి. త్వరలో ప్రవేశపెడుతున్న బడ్జెట్ సమావేశంలో కనీసం రూ.500 కోట్లు మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులను సీపీఐ ఆధ్వర్యంలో పర్యటన చేసి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి షేకావత్ దృష్టికి తీసుకెళ్తామని, ప్రాజెక్టుల నిర్మాణంలో ఈ వైసీపీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో విఫలమైందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రయ్య, గిడ్డయ్య, భూపేష్ పాల్గొన్నారు.