బంగారు బృందావన కవచం ఆవిష్కరణ

ABN , First Publish Date - 2023-05-27T00:17:33+05:30 IST

మూడు కేజీలతో తయారు చేసిన బంగారు బృందావన కవచాన్ని మంత్రాలయం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు, వ్యాస బరాజ మఠం పీఠాధిపతి విద్యాశిరీష తీర్థులు ఆవిష్కరించారు.

బంగారు బృందావన కవచం ఆవిష్కరణ

మంత్రాలయం, మే 26: మూడు కేజీలతో తయారు చేసిన బంగారు బృందావన కవచాన్ని మంత్రాలయం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు, వ్యాస బరాజ మఠం పీఠాధిపతి విద్యాశిరీష తీర్థులు ఆవిష్కరించారు. శుక్రవారం ఆర్‌ఆర్‌ నగర్‌ మఠంలో ప్రత్యేక వేదికపై మూడు కేజీల బంగారంతో తయా రు చేయించిన రాఘవేంద్రస్వామి బృందావనం, దానిపైన రాఘవేంద్రస్వామి ప్రతిమ కనిపించే విధంగా కవచాన్ని తయారు చేయించారు. బెంగళూ రులోని ఆర్‌ఆర్‌ నగర్‌ ప్రైవేటు రాఘవేంద్రస్వామి మఠానికి ఈ కవచాన్ని అందించనున్నారు. అనంతరం ఉభయ పీఠాధిపతులకు అక్కడున్న వేద పండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల మధ్య ముత్యాలు, వివిధ రకాల పుష్పాలతో అభిషేకం చేసి ఊరేగించారు. అనంతరం సామూహిక ముద్రధారణ చేశారు. కార్యక్రమంలో పండిత కేసరి రాష్ట్రపతి అవార్డుగ్రహిత విధ్వాన్‌ రాజాఎస్‌ గిరిరాజాచార్‌, జయనగర్‌ మఠం మేనేజర్‌ వాఘేంద్రా చార్‌, వాఘిరాజాచార్‌, ద్వారపాలక అనంతస్వామి, ప్రకాషాచార్‌, భీమ్‌సేన్‌ రావు, గౌతమాచార్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-05-27T00:17:33+05:30 IST