పోలీసుల అదుపులో అంతర్రాష్ట్ర దొంగలు

ABN , First Publish Date - 2023-07-21T00:32:01+05:30 IST

నగరంలో గత నెలలో వరుస చోరీలకు పాల్పడిన అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకు న్నారు.

పోలీసుల అదుపులో అంతర్రాష్ట్ర దొంగలు

కర్నూలు, జూలై 19: నగరంలో గత నెలలో వరుస చోరీలకు పాల్పడిన అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకు న్నారు. గత నెలలో త్రీటౌన్‌, తాలుకా, నాలుగో పట్టణ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఒకే రోజు ఐదు ఇళ్లల్లో చోరీలు జరిగాయి. ఈ చోరీలపై పోలీసు యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. బాధితుల ఇళ్లల్లో వేలిముద్రలు, సీసీ కెమెరాల ఫుటేజీల ఆధారంగా నిందితులు ఢిల్లీ, హర్యానా ప్రాం తాల కు చెందిన వారిగా గుర్తించారు. ఈ నేపథ్యంలో ఇద్దరు సీఐలు, ఇద్దరు ఎస్‌ఐలు, పది మంది స్పెషల్‌ పార్టీ బృందాలు 20 రోజుల క్రితం ఢిల్లీ వెళ్లాయి. 20రోజులపాటు వేట సాగించి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకు న్నారు. మరో ఇద్దరు పరారైనట్లు తెలిసింది. వీరి వద్ద నుంచి సుమారు 20 తులాల బంగారు నగలు రికవరీ చేసినట్లు సమాచారం.

Updated Date - 2023-07-21T00:32:01+05:30 IST