ఇంటర్‌ అడ్వాన్సడ్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

ABN , First Publish Date - 2023-06-14T00:09:27+05:30 IST

ఇంటర్మీడియట్‌ అడ్వాన్సడ్‌ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి.

ఇంటర్‌ అడ్వాన్సడ్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

ఫ ఫస్టియర్‌లో 72.59, సెకండియర్‌లో 76.95 శాతం ఉత్తీర్ణత

కర్నూలు(ఎడ్యుకేషన), జూన 13: ఇంటర్మీడియట్‌ అడ్వాన్సడ్‌ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో 28,294 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా, 25,538 మంది పాసై 72.59 శాతం ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్ర స్థాయిలో ఉమ్మడి కర్నూలు జిల్లా 9వ స్థానంలో నిలిచింది. అలాగే ఇంటర్‌ ద్వితీయ సంవత్సరంలో 26,126 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా, 19,966 మంది పాసై 76.95 శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్ర స్థాయిలో ఉమ్మడి కర్నూలు జిల్లా 12వ స్థానంలో నిలిచింది. ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్ష పలితాల్లో సంజామల ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, హాలహర్వి, గోనెగండ్ల, పెద్దకడుబూరు, అమ్మిరెడ్డినగర్‌ కేజీబీవీల్లో సున్నా శాతం ఉత్తీర్ణత వచ్చింది. ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం జనరల్‌ కోర్సుల్లో ఏపీ రెసిడెన్షియల్‌ కళాశాలలో 19 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా, 11 మంది పాసై 57.89 శాతం ఉత్తీర్ణత సాధించారు. అలాగే ఎయిడెడ్‌ కళాశాలల్లో 246 మంది పరీక్షకు హాజరు కాగా, 63 మంది పాసై 25.61 శాతం, ఏపీఎస్‌డబ్లూ రెసిడెన్షియల్‌ కళాశాలల్లో 36.69 శాతం, ఏపీటీడబ్లూ రెసిడెన్షియల్‌ కళాశాలల్లో 18.48 శాతం, బీసీ రెసిడెన్షియల్‌ కళాశాలల్లో 40 శాతం, కాంపోజిట్‌ కళాశాలలో 18.93 శాతం, ప్రభుత్వ కళాశాలలో 34.10 శాతం, ఇనసెంటివ్‌ కళాశాలలో 23.08 శాతం, కేజీబీవీలలో 47 శాతం, ఆదర్శ పాఠశాలల్లో 38 శాతం, ప్రైవేటు అన ఎయిడెడ్‌ కళాశాలల్లో 30.75 శాతం ఉత్తీర్ణత సాధించారు. అలాగే ఇంటర్‌ ప్రథమ సంవత్సరం జనరల్‌ కోర్సుల్లో ఎయిడెడ్‌ జూనియర్‌ కళాశాలలో 178 మందికి గానూ 59 మంది పాసై 33.15 శాతం, ఏపీటీడబ్లూ జూనియర్‌ కళాశాలలో 36.36 శాతం, కాంపోజిట్‌ కళాశాలలో 60 శాతం, ఏపీ రెసిడెన్షియల్‌ జూనియర్‌ కళాశాలలో 22.73 శాతం, ఏపీఎస్‌డబ్లూ జూనియర్‌ కళాశాలలో 53.14 శాతం, ఏపీటీడబ్లూ కళాశాలలో 23.03 శాతం, బీసీ రెసిడెన్షియల్‌ కళాశాలలో 66.67 శాతం, కాంపోజిట్‌ కళాశాలలో 14.33 శాతం, కో ఆపరేటివ్‌ జూనియర్‌ కళాశాలలో 32.61 శాతం, ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో 27.15 శాతం, ఇన్సెంటివ్‌ జూనియర్‌ కళాశాలలో 15.38 శాతం, కేజీబీవీలలో 40.07 శాతం, మోడల్‌ స్కూల్‌లో 34.91 శాతం, ప్రైవేటు అన ఎయిడెడ్‌ కళాశాలలో 32.67 శాతం ఉత్తీర్ణత సాధించారు.

Updated Date - 2023-06-14T00:09:27+05:30 IST