బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ

ABN , First Publish Date - 2023-02-09T00:41:45+05:30 IST

మహానంది మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను బుధవారం ఆలయం ప్రాంగణంలోని కల్యాణ మంటపంలో ఆలయ ఈవో కాపు చంద్రశేఖర్‌రెడ్డితో పాటు పాలకమండలి చైర్మన్‌ కొమ్మా మహేశ్వరరెడ్డి, పాలక మండలి సభ్యులు ఆవిష్కరించారు.

బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ
శివరాత్రి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను ఆవిష్కరిస్తున్న ఆలయ ఈవో, చైర్మన్‌

మహానంది, ఫిబ్రవరి 8: మహానంది మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను బుధవారం ఆలయం ప్రాంగణంలోని కల్యాణ మంటపంలో ఆలయ ఈవో కాపు చంద్రశేఖర్‌రెడ్డితో పాటు పాలకమండలి చైర్మన్‌ కొమ్మా మహేశ్వరరెడ్డి, పాలక మండలి సభ్యులు ఆవిష్కరించారు. ముందుగా ఆహ్వాన పత్రికను వేదపండితులు ఉత్సవమూర్తుల విగ్రహాల ముందు ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈనెల 16 నుంచి 21వ తేదీ వరకు మహానందిలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతాయని అధికారులు తెలిపారు. 16న సాయంత్రం ధ్వజారోహణంతో శివరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతాయని చెప్పారు. 17న ఉదయం సూర్యప్రభ వాహన సేవ, రాత్రి రావణ వాహన సేవ, 18న లింగోద్భవం, అదే రోజు రాత్రి స్వామి, అమ్మవార్ల కల్యాణం, 19న ఉదయం సింహ వాహన సేవ, రాత్రి పుష్ప పల్లకి సేవ, 20న మహానందీశ్వరుని రఽథోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. 21న ధ్వజ అవరోహణం, ఉత్సమూర్తులకు త్రిశూల స్నానం, యాగశాల మంటపంలో మహాపూర్ణాహుతి, రాత్రి 7గంటల నుంచి రుద్రగుండం కోనేరులో తెప్పోత్సవం కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని చెప్పారు. ఆలయ ఏఈవో ఎర్రమల్ల మధు, పర్యవేక్షకులు వెంకటేశ్వర్లు, శశిధర్‌రెడ్డి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ హరినాథ్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2023-02-09T00:41:47+05:30 IST