Share News

కక్షతోనే చంద్రబాబుపై అక్రమ కేసులు

ABN , First Publish Date - 2023-10-22T23:59:24+05:30 IST

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై కక్షతోనే సీఎం జగన్‌ అక్రమ కేసులు బనాయించి జైలుపాలు చేశారని టీడీపీ నాయకులు ఆరోపించారు.

కక్షతోనే చంద్రబాబుపై అక్రమ కేసులు

చెవిలో పూలు పెట్టుకుని నిరసన తెలిపిన టీడీపీ శ్రేణులు

కర్నూలు(అగ్రికల్చర్‌), అక్టోబరు 22: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై కక్షతోనే సీఎం జగన్‌ అక్రమ కేసులు బనాయించి జైలుపాలు చేశారని టీడీపీ నాయకులు ఆరోపించారు. ఆది వారం కర్నూలు నగరంలోని కలెక్టరేట్‌లో గాంధీ విగ్రహం వద్ద తెలుగుదేశం పార్టీ నాయకులు చెవిలో పూలు పెట్టుకుని వినూత్న రీతిలో ప్రభుత్వంపై నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు నరసింహులు, మహిళా కమిటీ జిల్లా అధ్యక్షురాలు ముంతాజ్‌బేగం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నరసింహులు మాట్లాడుతూ చంద్రబాబును అరెస్టు చేసినందుకు సీఎం జగన్‌ త్వరలోనే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని అన్నారు. త్వరలోనే న్యాయ స్థానాల్లో చంద్రబాబు నాయుడు నిర్దోషిగా జైలు నుంచి బయటకు వస్తారని అన్నారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలంతా ఏకతాటిపై నిలిచి తెలుగుదేశం పార్టీకి అధికారాన్ని కట్టబెట్టడం తథ్యమన్నారు.

Updated Date - 2023-10-22T23:59:24+05:30 IST