మూల పెద్దమ్మ ఆలయ హుండీ లెక్కింపు
ABN , First Publish Date - 2023-03-26T00:10:17+05:30 IST
మండల కేంద్రంలోని మూల పెద్దమ్మ ఆలయ తాత్కళిక హుండీ లెక్కింపును శనివారం పర్యవేక్షణాధికారి కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో లెక్కించారు.
గడివేముల, మార్చి 25: మండల కేంద్రంలోని మూల పెద్దమ్మ ఆలయ తాత్కళిక హుండీ లెక్కింపును శనివారం పర్యవేక్షణాధికారి కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో లెక్కించారు. ఉగాది సందర్భంగా వివిధ జిల్లాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారికి చెల్లించిన ముడుపు లను లెక్కించగా రూ.1,73,896 ఆదాయం వచ్చిం దని అన్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ సారి రూ.29,038 ఆదాయం పెరిగిందని ఆలయ ఈవో మోహన్ తెలిపారు. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ చిన్నన్న, ధర్మకర్తలు, వాల్మీకి సంఘ పెద్దలు పాల్గొన్నారు.