ఘనంగా తెలుగు భాషా దినోత్సవం

ABN , First Publish Date - 2023-08-29T23:53:31+05:30 IST

జిల్లా వ్యాప్తంగా గిడుగు రామ్మూర్తి 160వ జయంతి సందర్భంగా తెలుగుభాషా దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు.

ఘనంగా తెలుగు భాషా దినోత్సవం
గడిగరేవుల హైస్కూల్‌లో తెలుగుభాష ప్రాముఖ్యతను వివరిస్తూ ప్లకార్డులు ప్రదర్శిస్తున్న విద్యార్థులు

నందికొట్కూరు, ఆగస్టు 29: జిల్లా వ్యాప్తంగా గిడుగు రామ్మూర్తి 160వ జయంతి సందర్భంగా తెలుగుభాషా దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. నందికొట్కూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల, పలు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, ఆర్‌టీసీ డిపోలో తెలుగుభాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సంతగేటు జిల్లా పరిషత్‌ ఉన్నత బాలికల ఉర్దూ పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు రాజేశ్వరి ఆధ్వర్యంలో గిడుగు వెంకటరామమూర్తి చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు భాష తియ్యదనం, తెలుగుపాట కమ్మదనం అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్‌ సునీత ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర సాహిత్య అవార్డు గ్రహిత ఎలమర్తి రమణయ్య, రాజహంస బిరుదాంకితులు తోగట సురే్‌షబాబు పాల్గొన్నారు.

కొత్తపల్లి : తెలుగు ప్రజలు స్మరించుకోదగ్గ ప్రథమ స్మరణీయుడు గిడుగు రామ్మూర్తి అని దుద్యాల హై స్కూల్‌ ప్రధానోపాధ్యాయుడు మంగన్న అన్నారు. స్థానిక జిల్లా పరిషత్‌ హై స్కూల్‌లో గిడుగు రామ్మూర్తి జయంతి ఉత్సవాలు నిర్వహించి నివాళి అర్పించారు.

నంద్యాల (కల్చరల్‌): వచనకు రచనకు మార్గనిర్దేశకం చేసిన కర్త గిడుడు రామ్మూర్తిపంతులు అని వాఖ్యాత డాక్టర్‌ దివి హయగ్రీవాచార్యులు అన్నారు. నంద్యాల ఆర్టీసీ బస్టాండు ప్రాంగణంలో తెలుగు భాషా దినోత్సవాన్ని నిర్వహించారు. ఆర్టీసీ డిపోమేనేజర్‌ గంగాధరరావు, అసిస్టెంట్‌ మేనేజర్‌ మద్దులేటి నాయుడు, ఆర్టీసి సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2023-08-29T23:53:31+05:30 IST